ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒక రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. మరోవైపు కరోనా కారణంగా అనేక కంపెనీలు మూత పడ్డాయి. దీంతో ఎక్కడా ఉద్యోగాలు లభించడం లేదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సొంతంగా ఉపాధి మార్గం వెతుక్కోవడం ఒక్కటే మార్గం. అయితే స్వయం ఉపాధి అంటే.. అందుకు డబ్బు బాగా పెట్టుబడి పెట్టాలని అందరూ అనుకుంటుంటారు. కానీ అలా చేయాల్సిన పనిలేదు. చాలా తక్కువ పెట్టుబడితోనే నెలకు రూ.40వేల వరకు సంపాదించే మార్గం ఒకటుంది. అదేమిటంటే..
ప్రస్తుతం చాలా మంది దుస్తుల వ్యాపారాన్ని ఇంట్లోనే చేస్తున్నారు. అందువల్ల దీనికి పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. కేవలం మెటీరియల్‌కు మాత్రమే ఖర్చు అవుతుంది. షాప్ రెంట్, కరెంట్ బిల్, అడ్వాన్స్ వంటివన్నీ ఉండవు. మెటీరియల్‌ను కొనడంతోపాటు కాస్త అడ్వర్టయిజ్ మెంట్‌లపై దృష్టి సారించాలి. అంతే.. నెల తిరిగే సరికి సులభంగా రూ.40వేల వరకు సంపాదించవచ్చు. ముఖ్యంగా మహిళలు ఎంతో ఇష్టపడే చీరలను అమ్మడం ద్వారా ఇలా లాభం వస్తుంది.
ప్రస్తుతం హైదరాబాద్ వంటి అనేక నగరాల్లో దుస్తులను హోల్ సేల్‌గా చాలా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు. రూ.100, రూ.200లకే చీరలు, షర్ట్స్, ప్యాంట్స్ ను విక్రయిస్తున్నారు. రూ.100 ధర ఉండే ప్యాంట్స్, షర్ట్స్, చీరలను ముందుగా కొనాలి. రూ.20వేలు పెట్టి కొంటే.. ఒక్కోదానికి రూ.100 అనుకున్నా.. మొత్తం 200 యూనిట్స్ వస్తాయి. వీటిని రెట్టింపు ధరకు విక్రయించినా చాలు ఎంతో లాభం పొందవచ్చు. ఒక్కో యూనిట్ (షర్ట్, ప్యాంట్ లేదా చీర) ను రూ.200 కి విక్రయిస్తే.. రూ.100 లాభం వస్తుంది. అంటే నెలలో మొత్తం 200 యూనిట్స్‌ను విక్రయిస్తే రూ.40వేల వరకు వస్తాయి. ఇలా మనం లాభం పొందవచ్చు. యాడ్స్ ఇవ్వదలచుకుంటే.. యూనిట్ ఖరీదును కాస్త పెంవచ్చు. రూ.230 చేస్తే చాలు. ఆ పైన వచ్చే రూ.30ని యాడ్స్ కోసం వాడవచ్చు. దీంతో పబ్లిసిటీ కూడా బాగా అవుతుంది. లోకల్‌గా ఉండేవారు చాలా మంది వచ్చి దుస్తులను కొంటారు. ఇలా ఇంట్లోనే దుస్తులను విక్రయించడం ద్వారా చక్కని స్వయం ఉపాధి మార్గాన్ని పొందవచ్చు.