Shoes Before Home : ప్రతి ఒక్కరు కూడా, ఈ రోజుల్లో వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. వాస్తు ప్రకారం, ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి. సాధారణంగా మన ఇంట్లో, ప్రతిదీ కూడా మనం వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటాము. వాస్తు ప్రకారం నిలబడి వంట చేసుకోవడం, వాస్తు ప్రకారం కూర్చుని భోజనం చేయడం, ఇలా ప్రతిదీ. వాస్తు ప్రకారం, చెప్పులు పెట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంది. చెప్పులు విషయంలో, ఈ పొరపాట్లు చేయకూడదు.
చెప్పులు విషయంలో, ఈ పొరపాట్లు చేస్తే ఇబ్బందులు తప్పవు. చెప్పులు, బూట్లు మనం రోజు వేసుకుంటూ ఉంటాం. వాటిని ఒక దగ్గర పెట్టుకొని, మళ్ళీ బయటికి వెళ్లినప్పుడు వేసుకొని వెళ్తాం. అయితే, ఇంట్లో సరైన వైపు పెట్టకపోతే, అనర్ధాలు తప్పవని వాస్తు శాస్త్రం చెప్తోంది. చెప్పులని పెట్టాల్సిన చోట పెట్టకపోతే సమస్యలు తప్పవు. ఇంట్లో చెప్పులని కానీ బూట్లు కానీ, ఎప్పుడూ తలకిందులుగా ఉంచకూడదు. శని పాదాలకు సంబంధించినదని విశ్వసిస్తారు. చెప్పులని సరిగ్గా పెట్టకపోతే అశుభ ప్రభావం కలుగుతుందని, వాస్తు శాస్త్రం చెప్తోంది.
ఇంట్లోకి శని రాకుండా ఉండాలంటే, చెప్పులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం షూ, చెప్పులు వంటివి పెట్టుకునే దిశ వంటగది గోడకి కానీ పూజగదికి అనుకుని కానీ ఉండకూడదు. ఇలా ఉంటే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలి. అలానే, ఉత్తరం, తూర్పు, ఆగ్నేయం లేదా ఈశాన్య దిక్కుల్లో పెట్టకూడదు.
నైరుతి, వాయువ్య దిశలు షూ ని పెట్టుకోవడానికి సరైన దిశ కాబట్టి, ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. ఒకవేళ కనుక ఈ విధంగా మీరు చెప్పులని, షూ లని పెట్టారంటే ఇబ్బందులు తప్పవు. కాబట్టి, ఇక మీద ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. లేదంటే లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.