హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని కార్యాలు కొన్ని నియమాల ప్రకారం చేస్తే సత్పలితాలు వస్తాయి.! వాటిలో ఉదయం నిద్రలేవగానే వేటిని చూస్తే మంచిది? కలలో ఏవి కనిపిస్తే శుభం కలుగుతుంది, ఏవి వస్తే అశుభానికి సంకేతమో? ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయం నిద్రలెవగానే వీటిని చూస్తే శుభాలు కలుగుతాయి. సూర్యుడు ,ఎరుపు రంగు గల వస్తువులు ,బంగారం ,దీపం ,తామరపువ్వు ,పొలము ,సముద్రం ,గంధం, పుణ్యస్త్రీ , దూడ గలిగిన ఆవు , కుడి చేయి ,మృదంగం ,తన యందు ప్రేమానురాగాలు గలవారిని, మేఘములచే కప్పబడిన పర్వతాన్ని ,మంగళ తోరణములు ,పసుపు బట్టలు ,మంగళసూత్రం ,గాజులు పసుపు కుంకుమ ,తులసి చెట్టు ,పూల మొక్కలు. నిద్రలేవగానే వీటిలో ఏ వస్తువును చూసినా శుభం కలుగుతుందట.!!
కలలో ఇవి కనిపిస్తే మంచిది. పర్వతం, రధము, గుర్రము, ఏనుగు, నీరు, రాజు, ఆవు, దీపము, అన్నము, ఫలము, పుష్పములు, కన్య, అగ్ని, వేశ్య,తెల్లని పాము, మాంసము, గంగా స్నానము, దేవ దర్శనం, పూర్ణ కుంభము. కలలో ఇవి కనిపించడం వల్ల ఆరోగ్యం,ధనలాభం కలుగును.!!
క్రూర జంతువులు,కోతి తరుముట,ఉప్పు,ఇనుము, దొంగలు, రక్షక భటులు, బురద,నీటి యందు మునుగుట,రోగము వచ్చు నట్లు కనబడుట ఇలాంటి కలలు వస్తే ….వీరికి మృత్యు భయము, హాని కలిగే ప్రమాదముందట.!!