సన్నగా, ఆకర్షణీయంగా చక్కటి శారీరక రూపంతో వుండాలని అందరూ అనుకుంటారు. ముఖం, మెడ భాగాలలో ఏర్పడే కొద్దిపాటి కొవ్వు మీరు లావుగా వున్నారని సూచిస్తుంది. కనుక బయటకు బాగా కనబడే కాలర్ బోన్ సన్నగా, పొడవుగా వుంటే మీ ఆకర్షణకు మరింత అందం జోడవుతుంది. కాలర్ బోన్ పెరగాలంటే డీప్ నెక్ టాప్ వేసి సన్నగా కనపడవచ్చు. కొన్ని కాలర్ బోన్ వ్యాయామాలు చేయటం ద్వారా ముఖంలో కొవ్వు తగ్గించవచ్చు. కాలర్ బోన్ (ఛెస్ట్ బోన్) సన్నగా కనపడాలంటే కొన్ని వ్యాయామాలు చూడండి.
మెడ ఛాతీ భాగాలలో కొవ్వు తగ్గితే, కాలర్ బోన్ బయటకు వచ్చి బాగా కనపడుతుంది. ఛాతీ వ్యాయామాలైన పుష్ అప్ లు, డంబ్ బెల్స్ వంటివి ముఖం, మెడ, ఛాతీ కొవ్వులు కరిగిస్తాయి. జోగింగ్ లేదా రన్నింగ్, సుమారు 30 నుండి 45 నిమిషాలపాటు ప్రతిరోజు శరీర బరువును నియంత్రించేందుకు చేయాలి. ఇది కూడా కాలర్ బోన్ ను పెంచుతుంది. వెల్లకిలా పడుకొని చేతులు తలక్రింద పెట్టి శరీర పైభాగాన్ని పైకి లేపుతూ మోకాళ్ళను ముడవండి. ఈ భంగిమ పది సెకండ్లపాటు వుంచాలి. మెల్లాగా వెనుకకు నేలమీదకు ఒరగాలి విశ్రాంతి తీసుకోవాలి. దీనిని 10 సార్లు చేయాలి. ఈ వ్యాయామం ప్రతిరోజూ చేయాలి.
కాలర్ బోన్ పెరగాలంటే, స్విమ్మింగ్ మరో మంచి వ్యాయామం. ప్రతి రోజూ ఈత కొట్టండి. ఇది ఛాతీ కండరాలు బలపడేలా చేసి కొవ్వును కూడా తగ్గిస్తుంది. భుజాలు పైకిలాగి పది సెకండ్లు వుంచి దించేయాలి. ఇది 10 సార్లు చేయాలి. తిన్నగా నిలబడి, డంబ్ బెల్స్ పట్టుకోండి. వాటిని పైకి కిందకి ఒక్కొక్క చేయి 5 సార్లు చేయండి. మీ ఆహారంలో తాజా పండ్లు, కూరలు చేర్చండి. నూనె, జంక్ పదార్ధాలు మానండి. ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసులు నీరు తాగి శరీరానికి తేమనివ్వండి. ఈ కాలర్ బోన్ వ్యాయామాలు చేస్తే మీ కాలర్ బోన్ ఎటువంటి కొవ్వు లేకుండా సన్నగా ఆకర్షణీయంగా కనపడుతుంది.