జ్యోతిష్య ప్రపంచంలో కాకికి విశిష్ట స్థానం ఉంది. కొన్ని కథనాల ప్రకారం కాకి కొన్ని సంకేతాలు సూచిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. చనిపోయిన మనం పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మనకు సంకేతాలు ఇస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాంటి కాకి ఇంటి ముందు పదేపదే అరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
అకస్మాత్తుగా మీ ముందు కాకి ఆహారం తినడం మీరు చాలా సార్లు చూసి ఉండవచ్చు. ఇది మంచి శకునము మరియు శుభసంకేతాన్ని సూచిస్తుంది. అందుకే కాకికి ఎప్పుడు ఆహారం పెట్టాలని చాలామంది పెద్దవారు చెబుతూ ఉంటారు. దీనికి ఇది కూడా ఒక కారణం. హిందూ సంప్రదాయ ప్రకారం మరణించిన వారు కాకి రూపంలో ఆహారం తినడానికి వస్తారని భావిస్తాం. మరణించిన వారికి పిండ ప్రదానం చేసేటప్పుడు కాకి ఆహారం తీసుకుంటే మన పితృదేవతలు సంతృప్తి చెందుతారని నమ్ముతాము. ఒకవేళ కాకి గనుక ఆ ఆహారాన్ని ముట్టినట్లయితే చనిపోయినవారికి ఇష్టమైన కోరిక ఏదో తీరలేదని, అసంతృప్తితో ఆహారాన్ని ముట్టుకోలేదని భావిస్తారు. ఇలా పిండం పెట్టడానికి వెనుక గల ఆంతర్యం ఏమిటంటే.. పిండం పెట్టడం ద్వారా పక్షి జాతికి ఆహారం అందుతుంది.
మీరు ఇంటిలో నుంచి బయటికి వస్తున్న సమయంలో కాకి అరచి వెళ్లిపోయినట్లయితే మీరు అనుకున్న పని సక్సెస్ అవుతుందని దానికి సంకేతం. నీరు నిండి ఉన్న కొండమీద కాకి నిలబడి ఉన్నట్లు మీరు గాని చూసినట్లయితే త్వరలో మీకు ధన ప్రాప్తి కలుగుతుందని సూచన. కాకి అదే పనిగా ఇంటిదగ్గర గానీ, మీరు ఉండే ప్రదేశంలో గానీ అరుస్తూ ఉంటే అది అశుభానికి సంకేతంగా సూచించబడుతుంది.
ఒక వ్యక్తి తలపై కాకి పాలినట్లయితే వాళ్లు అవమానాలు పాలవుతారని మరియు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని సంకేతం ఇవ్వబడుతుంది. ఒకవేళ కాకి మహిళ తలపై గనుక వాలినట్లు అయితే ఆమె భర్త సమస్యల్లో చిక్కుకుంటారని సంకేతంగా చెప్పబడుతుంది. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు కాకి ఆగ్నేయ దిశగా రావడం చూసినట్లయితే మీరు అనుకున్న పని నెరవేరుతుందని, ద్రవ్య లాభం పొందుతారని సంకేతం అని పండితులు వెల్లడిస్తున్నారు.