Tulsi Plant : ప్రతి ఒక్క హిందువు ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని హిందువులందరూ కూడా లక్ష్మీదేవిగా భావించి, పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కష్టాలు ఉండవని, లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. తులసి మొక్కని పవిత్రంగా భావిస్తారు. కనుక కొన్ని నియమాలను కూడా ఖచ్చితంగా అనుసరించాలి.
తులసి మొక్కకి నీళ్లు పోసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అలానే తులసి మొక్కని పూజించేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటువంటి తప్పులని చేయకుండా చూసుకోవడం మంచిది. తులసి మొక్కకి నీరు పోసేటప్పుడు చాలామంది వాళ్లకి ఖాళీ ఉన్న సమయంలో నీళ్లు పోస్తూ ఉంటారు, కానీ కొన్ని జాగ్రత్తలు ని మాత్రం కచ్చితంగా తీసుకోవాలి. అలానే చాలామంది తులసి మొక్క కి దీపారాధన చేయడంతో పాటు నీళ్లని కూడా ఆ సమయాల్లో పోస్తూ ఉంటారు.
కానీ సంధ్యా సమయంలో తులసి మొక్కకి అస్సలు నీళ్లు పోయకూడదు. సాయంత్రం తులసి మొక్క కింద విష్ణుమూర్తి లక్ష్మీదేవి సేదతీరుతూ ఉంటారు. ఆ సమయంలో తులసి మొక్కకి నీళ్లు పోయకూడదు. అదేవిధంగా పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, సూర్య చంద్ర గ్రహణాల సమయంలో తులసి చెట్టుకి నీళ్లు పోయకూడదు. తులసి మొక్కకి ఎండిపోయిన ఆకులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మొక్కని మీరు అక్కడి నుంచి తొలగించి, ఎవరు తిరగనిచోట వదిలేయండి. అక్కడ మరో మొక్కని నాటండి.
ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉంటే అది అశుభం. ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుని పొరపాటున కూడా ముట్టుకోవద్దు. నీళ్లు కూడా పోయకూడదు. కానీ ఆ రోజుల్లో తులసి మొక్కకి పూజ చేయడం చాలా ముఖ్యం. ఎంతో మేలు కలుగుతుంది. తులసి ఆకులని గోళ్ళతో గిల్లకూడదు. స్నానం చేయకుండా తులసి మొక్కని ముట్టుకోకూడదు. ఇటువంటి తప్పులు చేస్తే కుటుంబంలో చికాకులు వస్తూ ఉంటాయి. చికాకులు తప్పవు.