ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి ఎవరి అలవాట్ల ప్రకారం వారు గుడికి వెళ్తూనే ఉంటారు…కొంతమంది ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి వెళ్తే మరి కొంతమంది మానసిక ప్రశాంతతకోసం గుడికెల్తారు. గుడికి వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అలా కాకుండా గుడికి వెళ్లినప్పడు పాటించాల్సిన నియమాలు తెలుసుకుంటే ఇకపై అలా చేయడానికి ఆస్కారం ఉండదు.. కాబట్టి దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమాలు తెలుసుకోండి. తీర్ధం తీసుకొనేటప్పుడు మూడుసార్లు విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా తీసుకోవాలి. వెంటవెంటనే మూడుసార్లు ఒకేసారి తీసుకోకూడదు.
ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను వెలిగించాలి. ఉదయం పూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపం ముఖం ఉండాలి. సాయంత్రం పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమరగా ఉండాలి. వినాయకుని ఒకటి, ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు, విష్ణు మూర్తికి నాలుగు, మర్రిచెట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రసాదాన్ని తినకుండా పారేయకూడదు.దీపాన్ని నోటితో ఆర్పకూడదు. ఒక దీపం వెలిగంచి రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించకూడదు. దీపం వెలిగించి వెంటనే బయటికి వెళ్లకూడదు. దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం, స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి. దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
పురుషులు దేవునికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. స్త్రీలు చేయకూడదు. స్త్రీలు మోకాళ్ళపై వంగి నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యన నడవకూడదు. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి, తరువాత ఆపాదమస్తకము దర్శించాలి. స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.