Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

కుబేర‌.. ఇది మంచి చెత్త లాంటి సినిమా అంటున్న నెటిజ‌న్‌..

Admin by Admin
June 23, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇది నేను సపోర్ట్ చెయ్యడం కాని వ్యతిరేకించడం కాని చెయ్యడంలేదు. ఆనంద్.. మంచి కాఫీ లాంటి సినిమా.. అని ట్యాగ్ లైన్ పెట్టిన శేఖర్ కమ్ముల.. కుబేర మంచి చెత్త లాంటి సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు. నిజంగా అలానే ఉంది. సినిమా మొత్తం చెత్త, ముష్టి తప్ప ఏం లేదు. స్టోరీ లోకి వస్తే.. (రాకుండా ఉంటే బావుణ్ణు అని మీకే మధ్యలో అనిపిస్తుంది అది వేరే విషయం). బంగాళాఖాతంలో అప్పుడే కనిపెట్టబడిన ఆయిల్ రిగ్గును సొంతం చేసుకోవాలని అనుకుంటాడు ఒక బడా వ్యాపారవేత్త.. ఎప్పట్లానే అధికారంలో ఉన్న రాజకీయనాయకుడు లక్ష‌ కోట్లు లంచం కావాలంటాడు. అందులో యాభై నలుపులో మరో యాభై తెలుపు అనే కండిషన్. తెలుపులో ఇవ్వాల్సింది ఎలా అని ఆ బడా వ్యాపారవేత్త తలపట్టుకున్నప్పుడు అతని తండ్రి దిలీప్ తాహిల్ అందుకు సరైనోడు ఒకడున్నాడు అంటూ అప్పటికే జైల్లో ఉన్న మాజీ సీబీఐ వ్యక్తి (నాగ్‌) గురించి చెప్తాడు.

ఈ దిలీప్ తాహిల్ నా చిన్నతనంలో తలనొప్పి రొంప తగ్గించే Vicks action 500 టాబ్లెట్ యాడ్ లో నటించిన వాడే అని నా డౌటు..అలా ఆవిధంగా కొడుక్కి వచ్చిన తలనొప్పి ఇప్పుడు కూడా తగ్గించాడు. వ్యవస్థల మీద కోపంతో, కూతురి మీద ప్రేమతో డీల్ కి ఒప్పుకుంటాడు నాగ్. వైట్ డబ్బును బినామీ పేరుతోనే ఇవ్వాలి అని అందుకు నలుగురు బిచ్చగాళ్ళు కావాలంటాడు. బిచ్చగాళ్లా.. అని సదరు Vicks 500 గారు ఆశ్చర్యపోతాడు.. నాకేమీ ఆశ్చర్య అనిపించలే.. నాకేనా లేక అందరికీనా అని నా సీటుకి అటు ఇటూ కూర్చున్న వాళ్ళ వంక చూస్తే.. అందులో ఒకడు ఫేస్ బుక్కు చూస్తూ బిజీగా ఉన్నాడు.. మరొకడి మొహంలో ఏ ఫీలింగు లేదు.సరే కంటిన్యూ చేద్దాం. అదిగో అందుకోసమే నాలుగు రాష్ట్రాలనుండి తెచ్చిన ముష్టోళ్ల‌లో తిరుపతి నుండి తెచ్చిన వాడే ధనుష్.

a netizen shares his honest review about kubera movie

ఈ నలుగురు ముష్టోళ్ళనూ తీసుకుపోయి.. Swiss diposit bank అని రాసివున్న ఒక గదిలో సంతకాల యవ్వారం చూసి స్విస్ బ్యాంకు లో ముష్టోళ్ళ పేరున డబ్బులు వేశారని అర్ధం చేసుకోవాలి..అక్కడినుండి స్విస్ ఖాతా దారులైన ఈ ముష్టోళ్ళ ఖాతా నుండి eye data ద్వారా రాజకీయ నాయకులకు డబ్బులు పంపిస్తూ ట్రాన్సాక్షన్ అయిపోయిన వెంటనే ఒక్కో ముష్టోన్ని చంపేస్తుంటారు…. ఇదే సినిమా కథ. ధనుష్ ఖాతాలో ఉన్న సొమ్ము బదిలీ చేసే క్రమంలో నాగ్ కంప్యూటర్లో స్విస్ బ్యాంక్ యాప్ అచ్చంగా మన యూనియన్ బ్యాంకు యాప్ లా నెట్ వర్క్ సరిగ్గా లేక అనుకుంటా పాపం గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది..అప్పటికే ధనుష్ ను లేపేయడానికి తీసుకపోతారు..ఇక్కడ కంప్యూటర్ లో చివర‌కు ట్రాన్సాక్షన్ ఫెయిల్‌ అవుతుంది. అప్పటికే అక్కడ ధనుష్ మిస్ (పారిపోతాడు) అన్నమాట. వాడికోసం వేటలో మనకి ఇంటర్వెల్ వచ్చి ఇంకో వంద రూపాయలకి రెక్కలు వస్తాయ్ .

డైరెట్రు గారికి సెక్యులర్ భావం కొద్దిగా ఎక్కువై మూడు మతాల మ్యూజిక్కులు పావుగంట తేడాలో వినిపించాడు.. కానీ మొదట తిరుపతిలో ఎక్కువగా ముష్టోళ్ళు వుంటారని అక్కడే మనిషి ప్రాణానికి విలువ లేనట్టు చూపించి నారాయణ మంత్రాన్ని BGM గా వినిపించాడు.. రెండోసారి ఈ రోజు శుక్రవారం కాబట్టి మసీదులో భోజనం పెడతారట. చక్కగా వాళ్ళంతా క్రమశిక్షణగా లైన్లో కూర్చుని తింటారు అన్నట్టు చూపించాడు.. BGM గా ముస్లిం devotional మ్యూజిక్ లైన్. మూడోసారి ఆదివారం పూట గాల్లో నుండి కిందపడుతూ BGM గా క్రిస్టియన్ మ్యూజిక్.. వినపడుతుంటే ముష్టి హీరో.. చిన్న దెబ్బకూడా తగలకుండా సేఫ్ గా పడతాడు.. ప్రేక్షకులకి ముందే అర్థమైపోయి సినిమాలో ఆఖర్న తెలిసే ట్విస్ట్ ఏంటంటే సదరు సీబీఐ అధికారి వారు కూడా చిన్నప్పుడు హీరో గారితో తిరిగిన పెద్ద ముష్టోడు..

రోజుకి పదివేలమందికి పైగా తిరుపతిలో ఎలాంటి తత్తరపాటు లేకుండా చక్కగా అన్నదానం జరుగుతుందని ప్రపంచం మొత్తం తెలిసినా శేఖర్ కమ్ముల అనే వాడికి తెలియకపోవడం విచిత్రాతి విచిత్రం.. మ్యూజిక్, మాటలు , క్యాస్ట్యూమ్ , కేరెక్టర్స్ , టేకింగ్ లాంటి వాటికి నూటికి పది మార్కులు కూడా వేయాలని అనిపించలేదు..ధనుష్ నటన కూడా ఊహించినంత గొప్పగా ఏం లేదు.. శివ పుత్రుడు సినిమాలో విక్రమ్ నటనను , బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోనీ నటనను చూసి ధనుష్ చాలా నేర్చుకోవాలి.. నా రేటింగ్: 1.1/5

— సేక‌ర‌ణ‌: ఫేస్‌బుక్ నుంచి..

Tags: kubera movie
Previous Post

పెరుగులో అర‌టి పండు క‌లిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Next Post

స‌ముద్ర‌పు అడుగు భాగంలో ఊపిరి బిగ‌ప‌ట్టి ఈ తెగ వారు ఎంత సేపైనా ఉంటారు తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

మీకు క‌ల‌లో వినాయ‌కుడు క‌నిపించాడా.. అయితే దాని అర్థం ఏమిటంటే..?

July 11, 2025
vastu

ఇంట్లో చెప్పులు వేసుకుని తిర‌గ‌డం మంచిదేనా..?

July 11, 2025
ఆధ్యాత్మికం

వినాయ‌కుడికి అస‌లు ఏ పండ్ల‌ను నైవేద్యంగా పెట్టాలో తెలుసా..?

July 11, 2025
వైద్య విజ్ఞానం

మీ ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోందా.. అయితే ఈ వ్యాధి కావచ్చు..!!

July 11, 2025
lifestyle

ఈ 5 వాసనలు ఉంటే దోమలు అస్సలు కుట్టవు.. ఎందుకంటే..?

July 11, 2025
చిట్కాలు

అధిక బరువా.. పర‌గడుపున ఇది తాగండి ఇట్టే తగ్గుతారు..!!

July 11, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.