2020 సంక్రాంతి కి రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో ఒకటి అల వైకుంఠపురం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోయింది. ఈ సినిమాలో మెజారిటీ కథ ఒక ఇంట్లోనే జరుగుతుంది. ఈ ఇంటిపేరే వైకుంఠపురం.
నిజ జీవితంలో ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? తెలుగు లో ఓ పాపులర్ న్యూస్ ఛానల్ ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచన చౌదరి భర్త వాళ్లదే. ఈ ఇంటి విలువ తెలుస్తే మాత్రం అవాక్కవ్వక తప్పదు. ఈ ఇంటి విలువ అక్షరాల మూడు వందల కోట్ల రూపాయలు. హైదరాబాదులో ఉండే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఇదొకటని సమాచారం. ఈ ఇంట్లో అల వైకుంఠపురంలో సినిమాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.
ఈ ఇంటిని చూసి అల్లు అర్జున్ ఎప్పుడో ముచ్చట పడ్డారని… ఇలాంటి ఇల్లు కట్టుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారని అన్నారు. ఏదేమైనా అల వైకుంఠపురం లో ఇల్లు మాత్రం ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది. సినిమా కథలో ఇల్లు భాగంగా ఉండటంతో ప్రేక్షకులకు పరిశీలనగా చూడక పోవచ్చు… ఒకవేళ చూస్తే మాత్రం అ రిచ్ నెస్ కు…ఆ ఇంటి అందానికి ఫిదా అయిపోవడం ఖాయం.