మన సమస్య ఏంటి అంటే .. చిరంజీవిని మనము ఎప్పుడు కూడా మెగా స్టార్ లాగానే చూడాలి అని కోరుకుంటాము .. చిరు విషయం కాసేపు పక్కన పెడదాము .. ఇంత కంటే దయనీయమైన పరిస్థితి ఒక పెద్ద మనిషి ఎదురుకున్నాడు .. సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన తరువాత, పాలిటిక్స్ లో అడుగుపెట్టి ఫెయిల్ అయ్యాడు .. ఆ తరువాత ఒక సినిమా ఆడిన కూడా, ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని utter ప్లాప్ అవ్వడం లో ఒకటితో మరొకటి పోటీ పడ్డాయి .. ఒకటి అరా సినిమాలు అపుడప్పుడు ఆడినా కూడా .. చివరికి బ్రేక్ కోసము తానే ఒక సంస్థని స్థాపించి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు , సొంత నిర్మాణం లో తీసిన సినిమాలు అడ్డంగా పోయాయి..
వయసు అయిపోయిన కూడా, యువకుడి చిత్రాలు చేసి అభాసు పాలు అయ్యాడు. మిస్ వరల్డ్ పోటీలకు స్పాన్సర్ గా ఉండి అసలుకే మోసం తెచ్చుకున్నాడు. పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాడు .. చివరికి తన సొంత ఇల్లు కూడా అప్పులు తీర్చడానికి అమ్మడానికి వీలు లేదు అని కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. దిక్కు తోచని స్థితి .. 20 కోట్ల అప్పు, చేతిలో చిల్లి గవ్వ లేదు, ఇంక పైకి వస్తాడు అన్న నమ్మకం లేదు. కొడుకుకి మంచి లాంచ్ ఇద్దాము అనుకుంటే మొదటి సినిమా చూసి కొంగ లాగ ఉన్నాడు అని అందరు చీదరించుకున్నారు . ఆ సమయం లో పెద్ద మనిషి 2 nd, 3rd ఇన్నింగ్స్ కాదు .. సూపర్ స్టార్ గా అవతారం చాలించి ఒక నటుడిగా వెలగాలని నిర్ణయించుకున్నాడు … యాష్ చోప్రా దెగ్గరికి వెళ్ళి, ఒక పాత్ర ఉంటె నాకు ఏదన్నా ఇవ్వండి నేను చేయడానికి సిద్ధం గా ఉన్నాను అని అడిగాడు.
ఆదిత్య చోప్రా ఎలాగూ సినిమా తీస్తున్నాడు, దానికి ఒక పెద్ద మనిషి పాత్ర కావాలి మీరు అయితే సరిపోతారు అని యాష్ చోప్రా నిర్ణయించుకున్న తరువాత .. మొహబ్బతే సినిమా లో నారాయణ శంకర్ పాత్ర వేసి తన హుందాతనంతో అందరిని ఆశ్చర్య పరిచి…ఒక నటుడిగా మొదటి మెట్టు ఎక్కాడు .. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ … దేనే వాలా జబ్బి దేతా … దేతా చెప్పర్ ఫాడికే .. అన్నట్టు .. కేబీసీ కూడా అదే సంవత్సరం ఆగష్టు లో మొదలయ్యి .. ప్రజలను ఒక ఊపు ఊపింది. చిరు చేస్తున్న తప్పు ఏంటి అంటే .. తాను ఇంకా 1980 లో మెగాస్టార్ గా ఉన్నట్టు ఇప్పుడు కూడా మెగా స్టార్ లాగానే జనాల ముందుకి వస్తున్నాడు .. జనాలకు చిరు ని మెగాస్టార్ గా చూసే మూడ్ లేదు .. Matured Star గా చూడాలి అని అనుకుంటున్నారు .. ఇంకా తమన్నా పక్కన డ్యూయెట్ పడితే చూసే ఓపిక జనాల్లో నశించింది ..
చిరు చేయాల్సింది ఏంటి అంటే .. ఒక నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టాలి .. అట్లా మొదలు పెట్టి సినిమా చేసిన రోజున.. చిరు సెకండ్ ఇన్నింగ్స్ కాదు .. మరో 20 ఏళ్ళు అవలీలగా ఇండస్ట్రీ ని ఏలుతాడు .. మెగాస్టార్ గా కాదు ఒక నటుడిగా .. చిరు చాలా గొప్ప నటుడు అనడం లో సందేహం లేదు .. ఆ నటుడిని తిరిగి జనాలకు పరిచయం చేయాలి .. ఆ మెగా స్టార్ ని కొద్దీ రోజులు దాచేయాలి .. ముందర ఉన్న నటుడిని కనుక చిరు జనాలకు పరిచయం చేస్తే .. వెనక దాగి ఉన్న మెగాస్టార్ ని జనాలు చెప్పకుండానే వెలికి తీస్తారు ..