ఒక్క అడుగు…ఒక్క అడుగు.. ఇకనుంచి పని మనది, పెత్తనం మనది, ఫలితం మనది… కొట్లాట కొస్తే ఎత్తిన చేయి నరికే కత్తినవుతా… నువ్వు శివాజీవి కాదు రా! ఛత్రపతి వి..
అసలు ఛత్రపతి సినిమా అంటే అప్పట్లో ఒక ఊపు ఊపిన సినిమా…డైలాగ్ తో పాటు బాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కే విజిల్స్ మీద విజిల్స్. రాజమౌళి సినిమా ఈ మాత్రం క్రేజ్ ఉంటది కదా. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కి ఎంతో మంది ఫాన్స్ అయిపోయారు. శ్రీలంక నుండి విశాఖపట్నం కి వలసవచ్చి అమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు శివాజీ. అక్కడ పోర్ట్ లో తప్పుడు పనులు చేసేవారికి ఎదురు తిరుగుతాడు. చివరికి వాళ్ళ అమ్మను కలుసుకుంటాడు.
ఇదంతా పక్కన పెడితే కాట్రాజ్ దగ్గర పని చేస్తూ హోటల్ లో కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు సూరీడు. వాళ్ళ మామయ్య దగ్గరనుండి ఉత్తరం వస్తే వాళ్ళ అమ్మను తీసుకొని దుబాయ్ వెళ్దాం అనుకుంటాడు. కానీ కాట్రాజ్ ఆపేస్తాడు. తరవాత ఛత్రపతి – కాట్రాజ్ ఫైట్. సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలైంది. అప్పటి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? మీరే ఒక లుక్ వేసుకోండి!