ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అరటి పండు ఒకటి. జీర్ణక్రియ వ్యవస్థను పెంపొందించడం, ఒత్తిడిని తగ్గించడం.. ఇంకా ఇలా చాలారకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ అరటిపళ్ళను తొందరగా పక్వానికి రావడం కోసం కొందరు కొన్ని రసాయనిక మందులను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల మనిషి రోగాల బారినపడి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే అరటి పళ్ళను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి కొనండి. ఇక్కడ జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ.
ఇంగ్లాండ్ కు చెందిన 43 ఏళ్ళ మరియా ల్యాటన్ తన భర్త సూపర్ మార్కెట్ నుండి తీసుకువచ్చిన అరటిపళ్ళను కిచెన్ లో అలా ఒకరోజంతా ఉంచింది. ఆ తర్వాతి ఆకలిగా ఉన్న తన ఆరేళ్ళ కూతురు, కవర్ ఓపెన్ చేసి అరటిపండును తీసుకుంది. అరటిపండును తింటుండగా, తన తల్లి అరటిపండుపై ఏదో మచ్చలా, గాయం అయినట్లుగా ఉండడంతో ఆ అరటిపండు తినవద్దని అందులోంచి వేరే పండును తీసిచ్చింది. మొదట ఒక అరటిపండుకే బూజుపట్టినట్లుగా, గాయం అయిన అరటిపండు ఉందనుకున్న మరియా ఇంకో అరటిపండు బయటకు తీసినా కూడా అలానే ఉందంట.
దీంతో వెంటనే టెస్కోకు మూడుసార్లు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. వాటిని వెనక్కి తీసుకురమ్మని సూపర్ మార్కెట్ యాజమాన్యం తెలిపింది. వెంటనే ఆమె సూపర్ మార్కెట్ కు వెళ్లి రిటర్న్ చేసింది. మీ ఇంట్లో సాలీడుపురుగులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. లేదని ఆమె సమాధానమిచ్చింది. అయితే ఆ తప్పుకు బాధ్యత వహిస్తూ టెస్కో డబ్బులు వెనక్కు ఇచ్చేసింది. వాటిపై విచారణ చేయాలని అరటిపళ్ళను వెనక్కు తీసుకుంది.
నిజానికి మరియా గనుక ముందే గమనించకపోయి ఉంటే గనుక చాలా పెద్ద ప్రమాదమే జరిగిఉండేది. ఎంత ప్రమాదమంటే చావుకి దగ్గరయ్యేలా. ఎందుకంటే ఆ అరటిపళ్ళను ఒక విషపూరితమైన సాలీడు కాటేసింది. అటువంటి అరటిపళ్ళను తినడం వల్ల కేవలం రెండు గంటలలోనే మనిషి చనిపోతాడని బ్రెజిల్ పరిశోధించి తెలిపింది. మీరు కూడా ఈసారి అరటిపళ్లు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. చూసి కొనుగోలు చేయండి.