ఓవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలని లైనప్ చేశారు. అయితే యంగ్ డైరెక్టర్ సుజిత్ తో ఓజి మూవీ షూటింగ్ గతంలోనే ప్రారంభమైంది. ఆర్ఆర్ఆర్ తరువాత దానయ్య నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే గతంలో ఈ మూవీ పూజా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కనిపించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వాచ్ పైనే ఫోకస్ పెట్టారు అభిమానులు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ నీ ఉద్దేశించి సమంత చెప్పే ఓ డైలాగ్ ఉంటుంది. వాడి వాచ్ అమ్మితే నీ బ్యాచ్ మొత్తం సెటిల్ అయిపోతుంది అని పవర్ స్టార్ రేంజ్ గురించి చెబుతుంది.
మరి పవన్ ధరించిన వాచ్ కంపెనీ ఏంటి? దాని ధర ఏంటి అనే వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నారు అభిమానులు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ పనేరాయ్ అనే ప్రముఖ కంపెనీకి చెందినది. దీని ధర 13.52 లక్షలు అని సమాచారం. అభిమానులు పవన్ ధరించిన ఈ వాచ్ బ్రాండ్ ను ఆన్లైన్లో సెర్చ్ చేయగా దాని ధర చూసి షాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కి సంబంధించిన ఈ వాచ్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు.