Radhe Shyam : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. రాధే శ్యామ్. ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు అంతగా ఆదరణ లభించలేదు. తొలి రెండు రోజులు పాజిటివ్ టాక్ వచ్చినా.. తరువాత నెగెటివ్ టాక్ పెరిగిపోయింది. దీంతో రాధేశ్యామ్ సినిమా యావరేజ్ టాక్‌ను చివరికి మూటగట్టుకుంది. ప్రభాస్‌కు అయితే పెద్దగా ఈ సినిమా అచ్చిరాలేదనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
సాధారణంగా చిన్న సినిమాలను ఓటీటీల్లో చాలా త్వరగా రిలీజ్ చేస్తుంటారు. పెద్ద సినిమాలు అయితే కనీసం 50 రోజులు అయినా పడుతుంది. కానీ ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ మాత్రం నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా.. అందులోనే ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. ఈ మూవీని ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్ట్రీమ్ చేయనున్నామని.. అమెజాన్ ప్రైమ్ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
ఇక పీరియాడికల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ అంటేనే మాస్ హీరో. అలాంటిది ఇందులో పూర్తి విరుద్ధంగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. కనుకనే చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీని మీద ఇంకా సాహో సినిమానే బెటర్ అని అంటున్నారంటే.. ఈ మూవీ ఎంతటి నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ సలార్, ఆదిపురుష్ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఇవి ఈ ఏడాది తరువాత విడుదల కానున్నాయి.