SS Rajamouli : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీ ఈ నెల 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదలవుతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ శరవేగంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు దేశంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాలను చుట్టేస్తున్నారు. ఇక తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో రాజమౌళి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాను తీసే ప్రతి సినిమాలోనూ ఎమోషన్స్ భారీ స్థాయిలో ఉంటాయని.. ప్రేక్షకులు వాటికి బాగా కనెక్ట్ అవుతారని.. అలాంటి సినిమాలు హిట్ అవుతాయని.. రాజమౌళి తన సక్సెస్ సీక్రెట్ చెప్పేశారు. అందువల్లే తాను తీసే ప్రతి సినిమాలోనూ ఎమోషన్స్ తారా స్థాయిలో ఉండేలా చూసుకుంటానని అన్నారు. కనుకనే తన ప్రతి సినిమా హిట్ అవుతుందని తెలిపారు.
ఇక బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా విడుదలైనప్పుడు అందులో ఉన్న ఎమోషన్స్ అందరికీ నచ్చాయని.. అందుకనే ఆ రెండు సినిమాలు ఎంతో పెద్ద హిట్ అయ్యాయని రాజమౌళి తెలిపారు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాతగా ఉండగా.. ఇందులో ఆలియా భట్, అజయ్ దేవగన్ తదితర బాలీవుడ్ నటులు కూడా నటించారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో సహజంగానే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.