ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు అందుకుంటాయి. ఈ దర్శకుడు ఎక్కువగా కుటుంబ నేపథ్యం, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ ఉండే కథలను ఎంచుకోవడంలో దిట్ట. ఈయన ఏ సినిమా తీసినా ముందుగా స్టార్ హీరోలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడు స్టార్ డమ్ రావడానికి త్రివిక్రమ్ ఎన్నో కష్టాలు పడ్డారని, ఆయన కష్టాలు వెనుక ఒక గది ఉందని, ఆ గదికి ఇప్పటికి కూడా ఆయన అద్దె కడతారని తెలుస్తోంది..
ఆయన కష్టాలకు ఆ గది కి సంబంధం ఏంటో ఒకసారి చూద్దాం.. త్రివిక్రమ్ మొదట్లో ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారట. ఈయన కమెడియన్ సునీల్ తో కలిసి ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాడట. అద్దె ఇంట్లో ఉండగానే ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా కష్టపడి నిద్రలేని రాత్రులు గడిపారట. ఈ విధంగా తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆ అద్దె గది లోనే ఉండి అనేక కథలకు ఆజ్యం పోసేవారట, అది వారికి చాలా కలిసొచ్చిందని, త్రివిక్రమ్ ని ఆ గది స్టార్ డైరెక్టర్ గా మార్చిందని, సునీల్ ని స్టార్ కమెడియన్ గా చేసిందని చెబుతుంటారు. అందుకోసమే ఇప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ గదికి నెలకు ఐదు వేల రూపాయలు అద్దె గా చెల్లిస్తున్నారు.
ఆ ఇల్లు పంజాగుట్ట లో ఉంటుందట, ఆ గదిని సెంటిమెంట్ గా భావించిన త్రివిక్రమ్ అక్కడికి వెళ్లి సినిమా కథలు రాస్తూ ఉంటారట. అందులో కూర్చుని కథలు రాస్తే రాయడం చాలా సులభమని, దాన్ని సెంటిమెంట్ గా భావిస్తూ గదికి నెల నెలా అద్దె చెల్లిస్తూ వస్తున్నాను అని తెలియజేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్.