Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఫైట్ స‌న్నివేశాల్లో కొన్ని సార్లు న‌టీన‌టుల‌ను నిజంగానే కొడ‌తారా..?

Admin by Admin
May 28, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేను కోడైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఓ సినిమాలో ఓ సీనియర్ హాస్యనటుడి పక్కన ఓ సన్నివేశంలో నటించటానికి ఓ హాస్య నటుడు అవసరమైనప్పుడు, అంతకముందు ఈ.వీ.వీ.సత్యనారాయణ గారి ఒకట్రెండు సినిమాలలో నటించిన నాకిష్టమైన వర్ధమాన నటుడు గుర్తుకొచ్చారు. ఆయన ఆంధ్ర లో ఉద్యోగం చేస్తుంటారని తెలుసుకొని ఫోన్ చేసి పిలిపించాము. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లోని స్ట్రీట్ సెట్ లో షూటింగ్. 300 అడుగుల నిడివిని దాటివుండే ఆ సన్నివేశాన్ని ఒకే షాట్ లో చిత్రీకరించాలని దర్శకుడి నిర్ణయం. ఒక క్యాన్ లో 400 అడుగుల నెగెటివ్ మాత్రమేవుంటుంది.(ఇప్పటిలా డిజిటల్ కాదు) షాట్ మధ్యలో కట్ చేయవలసివస్తే మళ్ళీ మరో కొత్త క్యాన్ లోడ్ చేయవలసిందే. ఆ విషయం ఇద్దరు నటులకూ చెప్పి డైలాగ్ రిహార్సల్స్ చేయించారు దర్శకుడు.

టేక్ చేస్తూ దర్శకుడు యాక్షన్ చెప్పగానే సీనియర్ నటుడు హుషారుగా అవసరం లేకున్నా వర్ధమాన నటుడిని ఎడాపెడా కొడుతూ డైలాగ్స్ చెబుతుంటే ఆ నటుడు నాలుగైదు డైలాగుల తరువాత డైలాగ్స్ తడబడి ఆగిపోతున్నారు. ఆ సీనియర్ ఎక్కడ్నించి తెచ్చారండీ ఇతన్ని టైమింగ్ లేదూ బొ….లేదూ.. అంటూ విసుక్కొన్నారు. మళ్ళీ కొత్త నెగెటివ్ క్యాన్ లోడ్ చేసి టేక్. మళ్ళీ సీనియర్ నటుడు రెచ్చిపోయి చేస్తుంటే మొత్తానికి అయ్యిందనిపించాడా వర్ధమాన నటుడు. సన్నివేశం తృప్తిగా రాకపోయినా సమయాన్ని,నెగెటివ్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు షాట్ ఓకే చెయ్యవలసివచ్చింది. తరువాత మేకప్ రూముకు వెళ్ళిన నాతో ఆ నటుడు వెరీ సారీ దేవీ గారు మీరెంతో అభిమానంతో నన్ను పిలిపిస్తే నేను బాగా నటించలేకపోయాను. ఆ సీనియర్ నటుడు షాట్ లో విపరీతంగా నన్ను కొడుతూ డైలాగులు చెబుతుంటే నా ఏకాగ్రత మొత్తం పోయింది సారీ అంటూ బాధపడుతుంటే ఆయన కంట్లో కన్నీటిపొర స్పష్టంగా కనిపించింది.

what really happens during fight scenes making

ఆయన షర్ట్ విప్పి వీపును చూపిస్తే షాకయ్యాను. చేతివేళ్ళ అచ్చులు ఎర్రగా ముద్రలు పడిపోయివున్నాయి. షాట్ జరుగుతున్నప్పుడే విషయం మాకు అర్ధమైందండీ బాధపడకండి అని ఓదార్చాను. నేనొక్కసారి కొన్నేళ్లు వెనక్కి ఫ్లాష్‌బ్యాక్‌కి వెళితే ,అదే సీనియర్ హాస్యనటుడు ఓరోజు భోజనాల సమయంలో, తన కెరీర్ తొలి దినాలలో ఓ హీరో శాడిజంతో తనతో ఆడుకొని తన ఆత్మ స్థైర్యాన్ని ఎలా దెబ్బతీశాడో చెబుతూ బాధపడిన సందర్భం గుర్తుకొచ్చింది. జరిగింది నిర్మాత గారికి చెబితే ఆయన ఆ సీన్ మళ్ళీ రీషూట్ చెయ్యండి ఫరవాలేదన్నారు. మళ్ళీ ఓరోజు షూట్ పెట్టి ఆ వర్ధమాన నటుడికే కాల్ చేస్తే ఆయన ఎందుకొచ్చిన తంటా అనుకొన్నారో ఏమో నాకు సెలవు దొరకట్లేదండి అని చెప్పేశారు. ఆస్థానంలో మరొక రెగ్యులర్ కమెడియన్ ని పెట్టి రీషూట్ ప్రారంభించాము.

ఈ సారి దర్శకుడు ఆ సీనియర్ నటునికి ఎందుకు రీషూట్ చేయవలసివచ్చిందో చెప్పి పక్క ఆర్టిస్ట్‌ని వెకిలిగా ఒక్క దెబ్బకూడా వేయటానికి వీల్లేదుఅని చెబుతూ, పక్క ఆర్టిస్ట్ తో ఒకవేళ ఆయనగనక నిన్ను కొడుతూ డైలాగ్స్ చెబితే నువ్వుకూడా ఆయనకి రెండు తగిలించి డైలాగ్స్ చెప్పు అన్నారు నవ్వుతూనే. అవాక్కయిన ఆ సీనియర్ కొంతసేపటికి తేరుకున్నాక, స్వతహాగా అద్భుతమైన నటుడుగనుక సింగిల్ షాట్‌లో అద్భుతంగా నటించారు. చెప్పొచ్చేదేమిటంటే…. కళాకారులు, రచయితలు అందరూ సున్నితమనస్కులై ఉంటారు అని తరచూ చెప్పే మాట కొందరి విషయంలో మాత్రమే నిజం. వాళ్ళూ మామూలు మనుషులే. ఈర్ష్య అసూయ ద్వేషాలు వాళ్ళకీ కామనే. సకల కళలన్నిటినీ మించిన కళ ఒకటుంది. స్థాయీ బేధాలు, కుల, మత, ప్రాంతీయ బేధాలేవీ పరిగణించక సాటి మనిషిని మనిషిగా చూసే కళ అది. ఆ కళ పేరు మానవత్వం. అతి తక్కువమంది మనుషులకు మాత్రమే అబ్బే అరుదైన కళ.

— దేవీ ప్రసాద్.

Tags: fight scenes
Previous Post

చ‌నిపోయిన వారి దుస్తుల‌ను ఎందుకు కాల్చేస్తారు..?

Next Post

ప్రియుడి కోసం పాకిస్తాన్‌ నుంచి పారిపోయి వచ్చిన మహిళ.. ఆమె సంపాదన నెలకు ఎంతో తెలుసా..?

Related Posts

వైద్య విజ్ఞానం

ఉద‌యం టిఫిన్ చేయ‌డం మానేస్తున్నారా.. అయితే ఎంత న‌ష్టం జరుగుతుందో తెలుసా..?

June 13, 2025
హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!