Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Featured

Health Tips : ఉద‌యం ప‌ర‌గ‌డుపున‌ దీన్ని పొట్ట‌లో వేసేయండి.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..!

Admin by Admin
November 20, 2021
in Featured, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Health Tips : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల బాక్టీరియాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఒక‌టి మంచి బాక్టీరియా అయితే.. రెండోది చెడు బాక్టీరియా. చెడు బాక్టీరియా మ‌న‌కు కీడు చేస్తుంది. మంచి బాక్టీరియా మ‌న‌కు మేలు చేస్తుంది. మంచి బాక్టీరియా వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Health Tips take this on empty stomach to get rid of health problems

మ‌న శ‌రీరంలో విట‌మిన్ డి, బి12ల‌ను ఆహారం నుంచి స‌రిగ్గా శోషించుకోవ‌డానికి మంచి బాక్టీరియా అవ‌స‌రం అవుతుంది. విట‌మిన్ కెను త‌యారు చేయ‌డానికి, ఒత్తిడిని త‌గ్గించి మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మార్చే సెరొటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్ప‌త్తి చేయ‌డానికి మ‌న‌కు మంచి బాక్టీరియా అవ‌స‌రం అవుతుంది. ఈ క్ర‌మంలోనే మ‌నం రోజూ మంచి బాక్టీరియా ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

మ‌న‌లో చాలా మంది రోజూ ఇడ్లీ, దోశ‌ల‌ను తింటుంటారు. పులియ‌బెట్టిన పిండితో వాటిని త‌యారు చేస్తారు. క‌నుక వాటిల్లో మంచి బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియానే ప్రొబ‌యోటిక్స్ అంటారు. అలాగే పుల్ల‌ని మ‌జ్జిగ‌, పెరుగు, 2 రోజుల పాటు నిల్వ ఉన్న రోటి ప‌చ్చ‌ళ్లు, గంజి, బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు, బాగా పండిన అర‌టి పండ్లు, ద్రాక్ష‌లు, జున్ను పాలలో మ‌న‌కు ప్రొ బ‌యోటిక్స్ ల‌భిస్తాయి.

అయితే ప్రొబ‌యోటిక్స్‌ను పొందేందుకు ఉత్త‌మ‌మైన మార్గం ఇంకొక‌టి ఉంది. రాత్రి పూట అన్నంలో పాలు పోసి తోడి పెట్టి అలాగే ఉంచాలి. మ‌రుస‌టి రోజు చ‌ద్ద‌న్నం త‌యార‌వుతుంది. దాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తినేయాలి. ఇది చాలా బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం. దీంతో మంచి బాక్టీరియా చాలా పెరుగుతుంది.

మంచి బాక్టీరియా పెరిగితే శ‌రీరంలో పైన చెప్పిన లాభాలు క‌లుగుతాయి. ఇక త‌ర‌చూ లూజ్ మోష‌న్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు, ఐబీఎస్ ఉన్న‌వారు, ఒత్తిడికి ఎక్కువ‌గా గుర‌య్యే వారు, అల్స‌ర్లు, జీర్ణాశ‌యం, పేగుల్లో పుండ్లు ఉన్న‌వారు, యాంటీ బ‌యోటిక్స్ ఎక్కువ‌గా వాడేవారు, జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ ఉన్న‌వారు, విట‌మిన్ల లోపం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు శ‌రీరంలో మంచి బాక్టీరియాను పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో ఆటోమేటిగ్గా ఆయా స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గిపోతాయి. ఈ విధంగా మంచి బాక్టీరియాను పెంచుకుని ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

ఇక రోజూ కూల్ డ్రింక్స్ తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం, నూనె ప‌దార్థాల‌ను తిన‌డం, ఐస్ క్రీమ్స్ తీసుకోవ‌డం, యాంటీ బ‌యోటిక్స్ లేదా పెయిన్ కిల్ల‌ర్స్‌ను ఎక్కువ‌గా వాడ‌డం, ఒత్తిడికి బాగా గుర‌వ‌డం.. వంటి వాటి వ‌ల్ల మంచి బాక్టీరియా త‌గ్గిపోతుంది. క‌నుక ఈ ప‌నులు చేయ‌రాదు.

ఇలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ మంచి బాక్టీరియాను పెంచుకునే విధంగా పైన తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకుంటే దాంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ కూడా మెరుగ్గా ప‌నిచేస్తుంది.

Tags: chaddannamgood bacteriahealthy foodspro bioticsచ‌ద్ద‌న్నంప్రొబ‌యోటిక్స్మంచి బాక్టీరియా
Previous Post

Garlic : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తినండి.. మీ శ‌రీరంలో ఈ మార్పులు వ‌స్తాయి..!

Next Post

నరదిష్టి తొలగిపోవాలంటే ఈ అద్భుతమైన చిట్కా పాటిస్తే చాలు..!

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!