భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు. బెల్లంతో చాలా మంది తీపి వంటకాలు కూడా చేసుకుంటారు. అయితే చక్కెరకు బదులుగా బెల్లంను వాడితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
1. బెల్లంలో మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, థయామిన్, రైబో ఫ్లేవిన్, నియాసిన్ అనబడే పోషకాలు ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
2. బెల్లంను రోజూ తినడం వల్ల శరీరం శుభ్రమవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శ్వాసకోశ, జీర్ణకోశ వ్యవస్థలు శుభ్రంగా మారుతాయి.
3. మలబద్దకం, ఇతర జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు రోజూ బెల్లంను తింటే ఫలితం ఉంటుంది.
4. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం బాగా తయారవుతుంది.
5. అధిక బరువు తగ్గించడంతోపాటు చర్మాన్ని సంరక్షించడంలోనూ బెల్లం బాగా పనిచేస్తుంది.
అయితే బెల్లాన్ని రోజూలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఉదయం పరగడుపునే ఒక చిన్న బెల్లం ముక్కను తిని అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. బెల్లంను ఉదయం తినడమే మంచిది.