కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కండరాల నొప్పులు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి&period; శరీరంలో ఎక్కడో ఒక చోట దెబ్బ తగలడం లేదా కండరాలు పట్టుకుపోవడం వల్ల కండరాల నొప్పి వస్తుంటుంది&period; అయితే ఈ విధంగా కండరాల నొప్పి ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది&period; ఏ పనీ చేయలేరు&period; కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే కండరాల నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది&period; మరి అందుకు ఏం చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6238 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;muscle-pain&period;jpg" alt&equals;"కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"770" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; నువ్వుల నూనెను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి&period; దాంతో నొప్పి ఉన్న చోట సున్నితంగా మర్దనా చేయాలి&period; రోజుకు రెండు సార్లు ఈవిధంగా చేస్తుంటే కండరాల నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గోరు వెచ్చని పాలను రోజుకు రెండు సార్లు తాగడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; అరటీస్పూన్‌ త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి రాత్రి పూట తాగాలి&period; నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మహాశంఖవటి&comma; లసూవాదివటి ఔషధాలను వాడుకోవచ్చు&period; నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; దశమూల చూర్ణం అర టీస్పూన్‌ తీసుకుని ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి అందులో కొద్దిగా పాలు కలిపి తాగాలి&period; దీన్ని రోజుకు ఒక్కసారి తీసుకుంటే కండరాల నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; యోగరాజ గుగ్గులు&comma; నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసుకోవాలి&period; గంట ఆగి స్నానం చేయాలి&period; అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రాత్రి పూట వంకాయలు&comma; మినుములు&comma; పెరుగు&comma; వేరుశెనగలు తీసుకోరాదు&period; నొప్పి ఉన్న చోట రక్త సరఫరా మెరుగు పడితే నొప్పి తగ్గుతుంది&period; అందుకు గాను ఆ ప్రదేశంపై చేత్తో అదిమిపట్టాలి&period; 1&comma;2 నిమిషాలు ఉంచి తీసేయాలి&period; ఇలా చేస్తుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts