Cotton Dosa : ఒక్క‌సారి ఇలా కాటన్ దోశ‌ల‌ను వేసి తినండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

Cotton Dosa : మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మ‌నం సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ‌ల‌ల్లో కాట‌న్ దోశ‌లు కూడా ఒక‌టి. ఈ దోశ‌లు రుచిగా, చాలా మెత్త‌గా ఉంటాయి. ఉద‌యం పూట ఒకేర‌కం టిఫిన్స్ తిని విసిగిపోయిన వారు ఇలా వెరైటీగా కాట‌న్ దోశ‌ల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వీటిని సాధార‌ణ దోశ‌ల వలె పులియ‌బెట్టి త‌యారు చేసుకోవ‌చ్చు లేదా ఇన్ స్టాంట్ గా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌ల‌ను కూడా అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారని చెప్ప‌వ‌చ్చు. రుచిగా, మృదువుగా ఉండే ఈ కాట‌న్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

కాట‌న్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం – ఒక క‌ప్పు, అటుకులు – పావు క‌ప్పు, బొంబాయి ర‌వ్వ – పావు క‌ప్పు, ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

Cotton Dosa recipe make like this once you will never forget
Cotton Dosa

కాట‌న్ దోశ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్నినీళ్లు పోసి 5 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. బియ్యం నానిన త‌రువాత ఒక గిన్నెలో అటుకులు వేసి నీటితో క‌డ‌గాలి. త‌రువాత నీటిని తీసేసి అర‌క‌ప్పు నీటిని పోసుకోవాలి. త‌రువాత ర‌వ్వ వేసి మ‌రో క‌లిపి మ‌రో 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నాన‌బెట్టిన త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ప‌చ్చికొబ్బ‌రి ముక్క‌ల‌పై ఉండే న‌ల్ల‌టి భాగాన్ని తీసేసి వీటిని కూడా జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత నాన‌బెట్టిన బియ్యం వేసి త‌గిన‌న్నినీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఈ పిండిపై మూత పెట్టి రాత్రంతా పులియ‌బెట్టుకోవాలి. ఇన్ స్టాంట్ గా ఈ దోశ‌ల‌ను చేసుకోవాల‌నుకునే వారు ఇదే పిండిలో వంట‌సోడా లేదా ఈనో వేసి క‌లిపి కాట‌న్ దోశ‌ను త‌యారు చేసుకోవ‌చ్చు.

ఇక పిండి చ‌క్క‌గా పులిసిన త‌రువాత ఉప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌లుపుకోవాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక నూనె వేసి టిష్యూ పేప‌ర్ తో తుడుచుకోవాలి. త‌రువాత‌పిండిని తీసుకుని ఊత‌ప్పం లాగా చిన్న‌గా, మందంగా వేసుకోవాలి. దోశ కొద్దిగా కాలి బుడ‌గ‌లు వ‌చ్చిన త‌రువాత మూత పెట్టి పూర్తిగా కాల్చుకోవాలి. దోశ కాలిన త‌రువాత అవ‌స‌ర‌మైతే మరో వైపుకు తిప్పి కొద్దిగా కాల్చుకునిప్లేట్ లోకి తీసుకోవ‌చ్చు. లేదంటే ప్లేట్ లోకి తీసుకుని చ‌ట్నీతో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా, మెత్త‌గా ఉండే కాట‌న్ దోశ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. వెరైటీ రుచులు కోరుకునే వారు ఇలా వెరైటీగా రుచిగా కాట‌న్ దోశను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts