Brinjal : పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోయే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుతోపాటు అధిక బరువును కూడా వేగంగా తగ్గించడంలో వంకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడంతో పాటు దీనిని ఉపయోగించడం వల్ల రోజంతా అలసిపోకుండా ఉత్సాహంగా ఉంటామని వారు చెబుతున్నారు. వంకాయలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. వంకాయలో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా వంకాయ నియంత్రణలో ఉంచుతుంది.
అదే విధంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణాలు వంకాయలో పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గాలంటే వంకాయను ఏవిధంగా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో నీటిని పోసి మరిగించాలి. నీరు మరిగిన తరువాత వంకాయ ముక్కలను వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత వంకాయ ముక్కలను నీటి నుండి వేరు చేసి ఒక గిన్నెలోకి తీసుకుని గంటెతో మెత్తగా చేయాలి. తరువాత అందులో రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని వేసి కలపాలి. దీనిని తినడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా దీనిని తినడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అలాగే అధిక బరువుతో బాధపడే వారు పైన చెప్పిన విధంగా వంకాయను తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.