Cow Ghee For Fat : మనం రకరకాల వంట నూనెలను వాడుతూ ఉంటాము. సన్ ప్లవర్ ఆయిల్, పల్లీ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రేన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇలా రకరకాల నూనెలను వాడుతూ ఉంటాము. తక్కువ ధరలతో కూడిన నూనెలను వాడడం వల్ల గుండె జబ్బులు వస్తాయని ఎక్కువ ధరతో కూడిన నూనెలను వాడడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. దీంతోప్రస్తుత కాలంలో ఆలివ్ ఆయిల్ వాడకం ఎక్కువైందని చెప్పవచ్చు. కానీ ఎటువంటి నూనెను వాడినప్పటికి మన ఆరోగ్యానికి హానే కలుగుతుందనే నిపుణులు చెబుతున్నారు. ఎందుకనగా నూనెను మనం 250 నుండి 260 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తేనే తప్ప నూనె మరగదు. ఇలా నూనెను వేడి చేయడం వల్ల నూనె అణువుల రూపం మారి ఫ్రీ రాడికల్స్ తయారవుతున్నాయి.
ఫ్రీరాడికల్స్ క్యాన్సర్ ను ప్రేరేపిస్తాయి. మనం ఎంత చక్కటి నూనెను తీసుకువచ్చి ఉపయోగించినప్పటికి దానిని వేడి చేయడం వల్ల దాని రూపం మారి మన అనారోగ్యానికి దారి తీస్తుందని వారు చెబుతున్నారు. నేటి తరుణంలో నూనెల వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. నూనెలను ఎక్కువగా వాడడం వల్ల మనం గుండె జబ్బులతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక మనం నూనెల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. నూనెలకు బదులుగా మనం మీగడను కానీ, వెన్నను కానీ ఉపయోగించాలి. ఇవి తక్కువ ఉష్ణోగ్రత వద్ద త్వరగా వేడెక్కుతాయి.అలాగే మీగడలో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుందని ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలోకి చేరినప్పటికి మనం తీసుకునే ఆహారంలో ఉండే ఫైబర్ ఈ కొలెస్ట్రాల్ ను మలం ద్వారా బయటకు తీసుకువస్తుందని దీంతో మన శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉంటుందని వారు చెబుతున్నారు.
కనుక వీటిని ఉపయోగించడం వల్ల దాదాపు మనకు ఎటువంటి హాని కలగదు. ఇక నూనెలకు బదులుగా మనం ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనకు మార్కెట్ లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుంది. ఈ ఆవు నెయ్యిని అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ మోతాదులో వంటల తాళింపుకు వాడుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్ కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనదని దీనిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని వారు సూచిస్తున్నారు. నూనెను ఎక్కువగా వాడితేనే కూరలు చాలా రుచిగా ఉంటాయి. కానీ నెయ్యిని తక్కువగా వాడినప్పటికి దీని రుచి, వాన కారణంగా కూరలు చాలా రుచిగా ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ విధంగా మనం సాధ్యమైనంత వరకు నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలని వాటికి బదులుగా ఆవు నెయ్యిని, మీగడను, వెన్నను ఉపయోగించుకోవాలని అప్పుడే మనం గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు.