Honey : ఆయుర్వేదంలో ఎన్నో మూలికలకు, మొక్కలకు ప్రాధాన్యత కల్పించారు. మన చుట్టూ ఉండే పరిసరాల్లో అనేక మొక్కలు పెరుగుతుంటాయి. అవి ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు. అలాగే మనం నిత్యం వాడే తేనె కూడా మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. అయితే దీని ద్వారా ప్రయోజనాలను పొందాలంటే దీన్ని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. తేనెను రోజూ ఒక క్రమబద్ధమైన విధానంలో తీసుకుంటే దాంతో ఎన్నో లాభాలను పొందవచ్చు. అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇక తేనెను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెను రోజుకు 4 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారికి 2 టీస్పూన్ల తేనెను తీసుకోవాలి. ముందుగా ఒక టీస్పూన్ తేనెను నోట్లో వేసుకుని చప్పరిస్తూ మింగాలి. ఆ సమయంలో తేనె గొంతుకు తాకాలి. ఈ విధంగా రెండో సారి కూడా ఇంకో స్పూన్ తీసుకోవాలి. ఇలా ఒకసారికి 2 టీస్పూన్ల తేనెను తీసుకున్న తరువాత మిగిలిన 3 సార్లు కూడా ఇలాగే తీసుకోవాలి. అంటే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఒకసారి, మధ్యాహ్నం లంచ్ తరువాత, సాయంత్రం సమయంలో, రాత్రి నిద్రకు ముందు.. ఇలా మొత్తం రోజుకు 4 సార్లు తేనెను తీసుకోవాలి. తడవకు 2 టీస్పూన్ల చొప్పున చప్పరిస్తూ తినాలి. ఇలా తేనెను తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
తేనెను పైన చెప్పిన విధంగా తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా తేనెను గొంతుకు తాకుతూ తీసుకుంటాం కనుక గొంతు సమస్యలు ఏవీ ఉండవు. గొంతులో నొప్పి, మంట, దగ్గు, ఇర్రిటేషన్ వంటివన్నీ తగ్గుతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం కరిగిపోతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే తేనెను ఇలా తీసుకుంటే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు, పగుళ్లు ఉండవు. శిరోజాలు కూడా కాంతివంతంగా మారుతాయి. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
తేనెను తీసుకోవడం వల్ల మెదడు ఉత్తేజంగా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చిన్నారుల్లో మెదడు వికసిస్తుంది. చదువుల్లో రాణిస్తారు. ఉత్సాహంగా మారుతారు. తెలివితేటలు పెరుగుతాయి. అలాగే గాయాలు, పుండ్లు మానుతాయి. అల్సర్లు తగ్గుతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు ఉండవు. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడతారు. సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. గజ్జి, తామర, దురదలు ఉండవు. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అలసట, నీరసం ఉండవు. కనుక తేనెను పైన తెలిపిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.