Life Style : ప్రస్తుత తరుణంలో అనేక మందికి చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. వాటిల్లో డయాబెటిస్, హైబీపీ ముఖ్యమైనవని చెప్పవచ్చు. చాలా మందికి ఇవి అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగానే వస్తున్నాయి. ఇంకా కొందరు పాటించే అలవాట్ల వల్ల కూడా వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ముఖ్యంగా కొన్ని రకాల అలవాట్లు మనకు తీవ్ర వ్యాధుల ముప్పును తెచ్చి పెడతాయి. ఇక ఎలాంటి అలవాట్ల వల్ల ఏం జరుగుతుందో, దాంతో మనకు ఏయే రకాల వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది రాత్రి పూట త్వరగా నిద్రించరు. రాత్రి 12, 1 లేదా 2 గంటల వరకు మెళకువతోనే ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో వారు ఫోన్ చూస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం రాత్రి పూట 10 తరువాత ఇంకా మేలుకొని ఉంటే మనకు అనేక వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. ఇలాంటి వారికి డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కనుక రాత్రి పూట త్వరగా నిద్రించాలి. ఉదయం త్వరగా నిద్ర లేవాలి.
ఇక చాలా మంది రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. దీని వల్ల శరీరంలో క్యాలరీలు పేరుకుపోతాయి. కొందరు రాత్రిపూట ఆహారాన్ని కూడా ఎక్కువగానే తింటారు. దీంతో కూడా బరువు పెరిగిపోతారు. ఇది డయాబెటిస్, గుండె జబ్బులకు దారి తీస్తుంది. కనుక రాత్రి పూట భోజనాన్ని త్వరగా ముగించాలి. రాత్రి 7.30 గంటల లోపు భోజనం ముగిస్తే మంచిది. అది కూడా చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక పొగ తాగడం, మద్యం సేవించడం కూడా మానేయాలి. ఇవి కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఈ అలవాట్లు ఉన్నవారికి క్యాన్సర్, హార్ట్ ఎటాక్ వచ్చే చాన్స్ పెరుగుతుంది. కనుక ఈ అలవాట్లు అన్నింటినీ మానేస్తే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. దీంతో ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.