డయాబెటిస్ ను పూర్తిగా నివారించటానికి నేటికీ పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అమెరికాలోని శాన్ఫోర్డ్ బర్న్ హాం మెడికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లోని రీసెర్చర్లు మొట్టమొదటి సారిగా కొవ్వు పదార్ధాలు శరీరంలో ఏ రకంగా డయాబెటిస్ ను కలిగిస్తాయనేది పరిశోధనలో కనుగొన్నారు. వీరు చేసిన ఈ పరిశోధనా ఫలితాలు డయాబెటిస్ ను సమూలంగా నివారించటానికి ఉపయోగపడగలవని భావిస్తున్నారు.
టైప్ 2 డయాబెటిస్ కు అధిక బరువుకు గల సంబంధాన్ని వీరు శాస్త్రీయంగా నిరూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికంగా తిన్నందువల్ల టైప్ 2 డయాబెటిస్ రావటానికి గల కారణాలను తాము అధ్యయనం చేశామని ఇపుడు దీని నివారణకు అవసరమైన ఎంజైముల సమర్ధతలను పెంచటంలో కృషి చేస్తున్నామని అధ్యయనానికి నేతృత్వం వహించిన డా. జేమీ మార్ధ్ తెలిపారు.
నేటికి ఇంగ్లాండ్ లో రెండు మిలియన్లకు పైగా జనాభా టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు, ఈ వ్యాధి అతి సహజంగా వ్యాప్తి చెందుతున్నట్లు స్టడీ నివేదికలు తెలుపుతున్నాయి.