గర్భిణీ మహిళలలో షుగర్ వ్యాధి తాత్కాలికమే. జీవితమంతా వుండేది కాదు. సరిగ్గా చర్యలు చేపట్టకపోతే, పిండం ఎదుగుదలకు హాని కలిగిస్తుంది. గర్భవతి మహిళ డయాబెటీస్ చిహ్నాలు చూపితే దీనినే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఈ సమయంలో గర్భవతి మహిళ రక్తంలో అధిక గ్లూకోజు కలిగి వుంటుంది. స్కానింగ్ లో తెలుస్తుంది. గర్భవతులకు ఈ రకంగా డయాబనెటీస్ ఎందుకు వస్తుందనేది నేటికి చిక్కుముడిగానే వుంది. ఒక్కొక్కరికి ఒక్కో కారణం వున్నట్లు పరిశోధనలలో తేలింది.
గర్భవతి దశలో ఉత్పత్తి చేసే హార్మోన్లు ఇన్సులిన్ సరఫరాలను లెక్కించవు. కుటుంబంలో డయాబెటీస్ ఎవరికి వున్నా, గర్భవతికి డయాబెటీస్ వచ్చితీరుతుంది. దీనిని నివారించకుంటే, బేబీకి హాని కలుగుతుంది. బేబీలకు ఊబకాయం వచ్చే ప్రమాదముంది. అధిక బరువు వున్న బేబీని సాధారణ డెలివరీతో ప్రసవించటం కష్టం. సిజేరియన్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది.
గర్భవతికి డయాబెటీస్ రాకూడదనుకుంటే ఆమె తన జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన సంతులిత ఆహారం తీసుకోవాలి. స్వీట్లు, అన్నం అధికంగా తినరాదు. శరీర బరువు నియంత్రించాలి. తగుమాత్రం వ్యాయామాలు చేయాలి. పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోరాదు. వీలైనంతవరకు డైలీ పనులు చేసుకుంటూనే వుండాలి. నడక, కొద్దిపాటి శ్రమ యాక్టివ్ గా వుంచుతుంది. వైద్యడిని తరచుగా సంప్రదించడం, షుగర్ లెవెల్ పరిశీలించుకుంటుండటం చేయాలి.