Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

Rice Husk Powder : చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా.. ఇందులో 3 రెట్లు ఎక్కువ పోష‌కాలు ఉంటాయి.. రోజూ గుప్పెడు తినాలి..!

Admin by Admin
October 25, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Rice Husk Powder : మనిషి ఆరోగ్యంగా జీవించడానికి పోషక విలువలు కలిగిన ఆహారం అత్యంత అవసరం. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటితోపాటు మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల‌ వలన కూడా అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మన శరీరం దృఢంగా ఉండాలంటే నిత్యం వ్యాయామంతోపాటు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇప్పుడు మనకు అనేక పోషకాల‌ను అందించే అత్యంత న్యూట్రిషన్స్ కలిగిన అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది త‌వుడు గురించి వినే ఉంటాం. త‌వుడును ఎక్కువగా పశువులకు దాణాగా ఉపయోగిస్తారు. కానీ దీనిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే తప్పకుండా మీరు కూడా త‌వుడును ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. 100 గ్రాముల త‌వుడుని తీసుకుంటే 316 క్యాలరీల శక్తి లభిస్తుంది. అంటే ఇది చికెన్, మటన్ కంటే మూడు రెట్లు ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. జంతువులకు త‌వుడు పెట్టి మనం మాత్రం పోషకాలు లేని తెల్లని బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం.

rice husk powder is healthier than chicken and mutton

ఇందులో 14 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ 50 గ్రాములు, ఫ్యాట్ 20 గ్రాములు, ఫైబర్ 21 గ్రాములు ఉంటుంది. అందువల్లనే త‌వుడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తీస్తారు. తెల్లని బియ్యంలో ఒక గ్రాము ఫైబర్ కూడా ఉండదు. ఈ క్ర‌మంలోనే పేగుల శుభ్ర‌త‌కు, పేగులలో మంచి బాక్టీరియా పెరుగుదలకు, మలబద్ధకం రాకుండా చేయడానికి త‌వుడులో ఉండే ఫైబర్ బాగా సహాయపడుతుంది. తవుడులో 35 నుంచి 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. తవుడులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తం తక్కువగా ఉండేవారు ఐరన్ ట్యాబ్లెట్ల‌కు బదులుగా త‌వుడును ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా ఎముకల దృఢ‌త్వానికి కాల్షియంతోపాటు ఫాస్పరస్ కూడా చాలా అవసరం. ఇందులో దాదాపుగా1677 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 1485 మిల్లీ గ్రాముల‌ పొటాషియం ఉంటుంది.

మెగ్నిషియం 781 మిల్లీ గ్రాములు, రక్షణ వ్యవస్థకు కావాల్సిన జింక్ 8 మిల్లీ గ్రాములు ఉంటుంది. రక్షణ వ్యవస్థకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే సెలీనియం15.6 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ విట‌మిన్లు కూడా త‌వుడులో పుష్కలంగా లభిస్తాయి. అందువలనే త‌వుడును శరీరానికి కావలసిన పోషకాల‌ గని అంటారు. ఇలాంటి త‌వుడు రైస్ మిల్లుల‌లో బాగా లభిస్తుంది. ఈ క్ర‌మంలోనే త‌వుడును పుల్కా లాంటి వాటిలోనూ, కొంచెం పొడి అన్నంలోనూ కలుపుకొని తినవచ్చు. దీంతో పైన తెలిపిన విధంగా అనేక లాభాల‌ను పొంద‌వచ్చు.

Tags: rice husk powder
Previous Post

Onion For Hair : ఉల్లితో ఇలా చేస్తే ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది.. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది..!

Next Post

Anjeer : రాత్రి నీటిలో అంజీర్‌ను నాన‌బెట్టి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వాటిని తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Related Posts

వినోదం

ఒకే కథతో వచ్చి ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.. అవేంటంటే..?

June 3, 2025
lifestyle

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

June 3, 2025
sports

టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో వైట్ జెర్సీని ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?

June 3, 2025
హెల్త్ టిప్స్

మీ ఆయుర్దాం పొడిగించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

June 3, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ప్ర‌ధానంగా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

June 3, 2025
వైద్య విజ్ఞానం

త‌ల‌నొప్పి అస‌లు ఎన్ని ర‌కాలు.. అవి ఎందుకు వ‌స్తాయి.. ఏం చేయాలి..?

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!