Cardamom : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి యాలకులను వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని తరచూ వంటల్లో వేస్తుంటారు. ఎక్కువగా తీపి వంటకాల్లో యాలకులను వాడుతుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం యాలకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. యాలకులను రోజూ రాత్రి పూట భోజనం చేశాక ఒక కాయను నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యాలకులను రోజూ తినడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు అయినా సరే తగ్గిపోతాయి. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, మలబద్దకం తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది.
2. యాలకులను తినడం వల్ల శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. వ్యాధులు రాకుండా ఉంటాయి.
3. యాలకులను నమిలి తింటే నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గి అవి దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
4. యాలకులను నమిలి మింగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ల నుంచి విముక్తి లభిస్తుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం రాకుండా ఉంటాయి.
5. వాంతులు, వికారం సమస్యలు ఉన్నవారు యాలకులను నమిలి తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అతి దాహం, ఆకలి నియంత్రణలోకి వస్తాయి. తలతిరగడం తగ్గుతుంది. ఇలా యాలకులతో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.