సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు, డైటర్లు సలాడ్లు అధికంగా తింటారు. ఎందుకంటే అవి సమర్ధవంతంగా పనిచేయటమేకాక, కడుపు నిండటం, పోషకాహారాలనివ్వటం కూడా చేస్తాయి. కేలరీలు వుండవు. కనుక అధిక బరువు తగ్గాలనే వారంతా సలాడ్లు తినచ్చు. అయితే వీటిని ఏరకంగా తింటే అధిక ఫలితాన్నిస్తాయో చూద్దాం! బ్రేక్ ఫాస్ట్ – కూరగాయలు తరిగే టైమ్ లేకుంటే, పండ్లు, కాయలతో కూడా చేసుకోవచ్చు. ఈ ఆహారాలు కూడా సలాడ్ ఆహారమే. వీటికి కొవ్వు తక్కువగా వుండే ఛీజ్ లేదా క్రీమ్ వంటివి కూడా కలిపి తినవచ్చు. లేదా వెజిటబుల్ శాండ్ విచ్ కూడా మంచి ఆహారమే.
లంచ్ – ఉడికించిన కూరల సలాడ్ లేదా తాజాగా కోసిన పచ్చి కూరలు ఆరోగ్యం, కడుపు నిండుతుంది. వీటిలో కొద్దిపాటి బ్లాక్ పెప్పర్, జీలకర్ర వంటివి కూడా వేయవచ్చు. ఈ ఆహారానికి కేరట్లు, దోసకాయలు, బ్రక్కోలి, టమాటాలు, కేబేజి ఆకులు వంటివి పనికొస్తాయి. దీనితోపాటు ఒక ఉడికించిన గుడ్డు, ఎండు ఫలాలు, క్రీము, స్ట్రాబెర్రీ, నిమ్మ, బెర్రీ, వాటర్ మెలన్ వంటి పండ్లు కూడా బాగా పనిచేస్తాయి. సాయంత్రం స్నాక్స్ – సలాడ్ ఆహారం కిందే….తాజా పండ్లు, నట్స్ వంటివి పాలు లేదా పెరుగుతో కలిపి తినేయండి. నిమ్మజాతి పండ్లు బాదంపప్పులు, పెరుగులో ముంచుకు తింటే చాలు. పండ్లరసం లేదా వెజిటబుల్ సూప్ కూడా తాగండి.
డిన్నర్ – దీనిలో ఉడికించిన వెజిటబుల్ సలాడ్ తినాలి. తేలికగా జీర్ణం అవటమే కాక పోషకాలు కూడా అందిస్తుంది. పాలు లేదా సూప్ కూడా తీసుకుంటే డిన్నర్ పూర్తయినట్లే బ్రౌన్ రైస్, ఉడికించిన గుడ్డు కూడా మంచి పోషకాలనిస్తాయి. నిద్రకు కనీసం 3 లేదా 4 గంటల ముందు డిన్నర్ తీసుకోండి. ఈ రకమైన ప్యూర్ సలాడ్ డైట్ తింటే, అధిక బరువు నియంత్రించి స్మార్ట్ గా తయారైపోవచ్చు. ప్రతిరోజూ కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి.