సాధారణంగా స్నాక్స్ తింటే బరువెక్కువవుతారని అందరూ భావిస్తారు. అయితే, స్నాక్స్ లో కూడా కొన్ని ఆరోగ్యకర స్నాక్స్ వున్నాయి. వీటిని తింటే తేలికగా బరువుతగ్గుతారు. అవేమిటో పరిశీలించండి. ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే చెడు కొల్ల్లెస్టరాల్ 4.5 శాతం తగ్గుతుంది. ఇవి అధిక పీచు కలిగి తక్కువ కార్బోహైడ్రేట్లతో వుంటాయి. కడుపు కూడా నింపుతాయి. విటమిన్లు, ప్రొటీన్లు, తక్కువ కొవ్వు కలిగి వుంటాయి. జీడిపప్పు, అప్రికాట్, వాల్ నట్స్ వంటివి కూడా ఆరోగ్యమే. ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్ గా తినవచ్చు.
నేటి కాలంలో చల్లదనాన్నుండి తట్టుకోడానికి బరువు తగ్గించుకోడానికి అద్భుతమైన ఆహారం వెజిటబుల్ సూప్. సూప్ లో ఉడికించిన కూరగాయలు ప్రొటీన్లు, ఇతర పోషకాలను అందిస్తాయి. కేరట్ లేదా టమాటా వంటివి వేస్తే మరింత కడుపు నింపుతాయి. తాజాగా కోసిన కూరలు లేదా పండ్లు చక్కగా కడుపు నింపటమే కాదు, బరువు తగ్గించే ఆరోగ్యకర ఆహారం. పండ్లను కడుపు నింపేందుకు ఇష్టమైన ఆహారంగా తినవచ్చు. దీనికి తక్కువ కొవ్వున్న వెన్న లేదా పెరుగు లేదా ఛీజ్ వంటివి చేరిస్తే సలాడ్ మరింత రుచిగా వుంటుంది.
కేరట్లను ముక్కలుగా చేసి వాటికి వెన్న లేదా పెరుగు వంటివి చేర్చి తింటే కడుపు నిండి హాయిగా వుంటుంది. బరువు తగ్గటమే కాదు కేరట్లు మీకు మంచి చర్మపు రంగు, నిగనిగలాడే జుట్టు కూడా ఏర్పరుస్తాయి. పెరుగు నేరుగా తినేయవచ్చు లేదా కొద్దిపాటి ఉప్పు లేదా పండ్లు లేదా కూరగాయలవంటివి కలిపి తినవచ్చు. బెర్రీలు మరింత రుచిగా వుంటాయి. బరువు తేలికగా తగ్గాలంటే ఈ సహజ పదార్ధాలను స్నాక్స్ గా తీసుకుంటూ ఆరోగ్యంగా కూడా వుండవచ్చు.