Toxics In Body Symptoms: మన శరీరంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు మల మూత్రాల ద్వారా అలాగే చెమట రూపంలో బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. కానీ మారిన మన ఆహారపు అలవాట్లు, జీవనవిధానం కారణంగా మన శరీరంలో మలినాలు పేరుకుపోతున్నాయి. శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సరిగ్గా జరగక మనం అనేక అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నాము. అయితే మన శరీరం కొన్ని సంకేతాల ద్వారా శరీరంలో మలినాలు ఎక్కువగా పేరుకుపోయాయని తెలియజేస్తుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం వల్ల మనం తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో వ్యర్థాలు, మలినాలు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు మన శరీరం ఎటువంటి సంకేతాలను సూచిస్తుందో.. ఇప్పుడు తెలుసుకుందాం.
తరుచూ వికారం, కడుపు ఉబ్బరంగా ఉన్నట్టైతే మీ జీర్ణవ్యవస్థలో సమస్య ఉన్నట్టు అర్థం. పొట్టలో బ్యాక్టీరియా అసమతుల్యత ఉన్నట్టు అర్థం. అలాగే తరుచూ నీరసంగా ఉన్నట్లయితే ఇది మీ శరీరం పూర్తిగా టాక్సిన్లతో నిండి ఉందని తెలియజేస్తుంది. శరీరం పర్యావరణ టాక్సిన్లకు గురి కావడం వల్ల అలసట, నీరసం, శక్తి క్షీణించినట్టు అనిపించడం వంటివి జరుగుతాయి. అలాగే మలబద్దకం సమస్యతో బాధపడే వారు కూడా తమ శరీరానికి డిటాక్సిఫికేషన్ చాలా అవసరమని అర్థం చేసుకోవాలి. పెద్ద ప్రేగులో టాక్సిన్ లు, వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మలబద్దకం సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎటువంటి కారణం లేనప్పటికి తరుచూ చికాకుగా ఉన్నట్టైతే మీ శరీరం విష పదార్థాలతో పేరుకుపోయిందని అర్థం.
శరీరంలో విష పదార్థాలు పెరగడం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. మెదడు పసనితీరు సక్రమంగా ఉండదు. అభిజ్ఞా పనితీరు కూడా దెబ్బతింటుంది. అలాగే జీర్ణ వ్యవస్థంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ సక్రమంగా ఉండనప్పుడు నాలుకపై తెలుపు లేదా పసుపు రంగులో పూత లాగా ఏర్పడుతుంది. దీనిని బట్టి కూడా మనం శరీరానికి డిటాక్సిఫికేషన్ అవసరమని అర్థం చేసుకోవచ్చు. అలాగే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల చర్మం యొక్క ఛాయ తగ్గుతుంది. చర్మం కాంతిహీనంగా తయారవుతుంది. అలాగే శరీరంలో టాక్సిన్ లు, విష పదార్థాలు పేరుకుపోవడం వల్ల తీపి పదార్థాలను, చక్కెరను తీనాలనే కోరిక పెరుగుతుంది. ఈ విధంగా ఈ లక్షణాలు కనుక మీలో కనిపించినట్లయితే మీ శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయాయని మీ శరీరానికి డిటాక్సిఫికేషన్ చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.