ఈ రోజుల్లో ఇరెగ్యులర్ పీరియడ్స్‌తో చాలా మంది మహిళలు ఇబ్బందిపడుతున్నారు. కొంతమందికి రెండు, మూడు నెలలైనా నెలసరి రాదు. పీరియడ్స్ సాధారణంగా సుమారుగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి వస్తాయి. నెలసరికి మధ్య ముప్ఫై ఐదు రోజుల కంటే ఎక్కువ సమయం ఉంటే.. దాన్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. బ్లీడింగ్ తక్కువగా కావడం, నెలసరి ఆలస్యం, ఎక్కువగా బ్లీడింగ్ అవుతుండటం, కొన్నిసార్లు ముద్దలుగా పడిపోతుంది. పీరియడ్ సమయంలో నొప్పి అధికంగా ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. నెలసరి టైమ్‌కు రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. థైరాయిడ్, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్, గర్భనిరోధక మాత్రలు వాడినా నెలసరి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీవన శైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, అలసట, పని ఒత్తిడి, మానసికంగా ఇబ్బందులు, వ్యాయామం ఎక్కువగా చేయడం, పనిభారం వంటి కారణాల వల్ల కూడా ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్య వస్తుంది.
రక్తిహానత కారణంగాను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య వచ్చే అవకాశం ఉందని NCBI నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలం ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడే మహిళలకు సంతానలేమి, బోలు ఎముకల వ్యాధి, గుండె సమస్యలు, ఎండోమెట్రియల్ హైపర్‌ప్లాసియా (గర్భాశయం యొక్క లైనింగ్ యొక్క గట్టిపడటం) వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని NCBI నివేదిక తెలిపింది. సకాలంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ను ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో బాధపడే మహిళలు.. లైఫ్‌స్టైల్‌లో మార్పులు,, క్రమం తప్పుకుండా వ్యాయమం, పోషకాహారం తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద డాక్టర్ ఈలా అన్నారు. నెలసరి సరిగ్గా రాని మహిళలు వారి డైట్‌లో కొన్ని పండ్లు చేర్చుకోవాలని డా. ఈలా సూచించారు. అవేంటే చూసేయండి.
ఆరెంజ్‌లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ కారణంగా పీరియడ్స్ గాడి తప్పుతాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మ, కివి, మామిడి తీసుకున్నా సమస్య దూరమవుతుంది. ఈ పండ్లను రెగ్యులర్‌గా తింటే.. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తగ్గుతుంది. మహిళలు దానిమ్మ తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆడవాళ్లు డైట్‌లో దానిమ్మ తీసుకుంటే.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, గర్భాశయం అసాధారణ ఆకృతి వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడే మహిళలు.. దానిమ్మ తీసుకుంటే మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భాశయం యొక్క లైనింగ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తీసుకుంటే మీ పీరియడ్స్ సమయానికి వస్తాయి. పైనాపిల్ ఎరుపు, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. పైనాపి జ్యూస్ తీసుకుంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ దారిలో పడతాయి. నెలసరి సమయంలో ఇబ్బంది పెట్టే అధిక రక్త స్రావం సమస్యకు కూడా చెక్ పెడుతుంది. అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగు కదలికలను, జీర్ణక్రియకు మెరుగుపరిస్తాయి. మానసిక ఆరోగ్యానికి ఈ పోషకాలు సహాయపడతాయి. ప్రతి రోజూ ఒక అరటిపండు తింటే.. PMS, మూడ్ స్వింగ్స్, క్రమరహిత పీరియడ్స్ సమస్య దూరమవుతుంది.