ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. భారత్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. అందుకు గాను ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పు
డయాబెటిస్ ఉన్నవారు రోజూ బాదంపప్పును గుప్పెడు మోతాదులో తినాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. బాదంపప్పును తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా తగ్గించుకోవచ్చు.
ఆకుపచ్చని కూరగాయలు
ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలలో మనకు అవసరమైన అనేక విటమిన్లు, మినరల్స్, ఇతర పోషకాలు ఉంటాయి. పాలకూర, క్యాబేజీ వంటి వాటిని రోజూ తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు. రోజూ వీటిని తినలేకపోతే జ్యూస్ చేసుకుని పరగడుపునే ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
సిట్రస్ పండ్లు
నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి పండ్లలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం షుగర్‌ను అదుపులో ఉంచుతాయి.
బెర్రీలు
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ప్ బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.
మెంతులు
డయాబెటిస్ ఉన్నవారికి మెంతులు వరమనే చెప్పవచ్చు. వీటిని రోజూ రాత్రి గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. లేదా భోజనానికి ముందు మూడు పూటలా ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ మెంతుల పొడిని కలుపుకుని తాగాలి. దీని వల్ల కూడా షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
కాకరకాయ
రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కాకరకాయల రసాన్ని తాగుతుండాలి. దీంతో షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.