Tomato : టమాటాలను చాలా మంది రోజూ కూరల్లో వేస్తుంటారు. వీటి వల్ల వంటలకు చక్కని రుచి వస్తుంది. టమాటాలు లేకుండా అసలు ఏ వంటకం పూర్తి కాదు.. అంటే అతిశయోక్తి లేదు. అంతలా టమాటాలను చాలా మంది వాడుతున్నారు. అయితే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, నల్లని వలయాలు పోయి ముఖం కాంతివంతంగా, క్రిస్టల్ క్లియర్‌గా మారాలంటే.. అందుకు టమాటాలు ఎంతగానో దోహదపడతాయి. వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా కాయ ఒకదాన్ని తీసుకుని బాగా గుజ్జుగా చేయాలి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తరువాత ముఖానికి రాయాలి. 30 నిమిషాల తరువాత ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారంలో 3 లేదా 4 సార్లు చేయాలి. దీంతో ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు అన్నీ తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది.
టమాటాల్లో ఉండే యాక్సిడెంట్లు కణాలను రక్షిస్తాయి. దీంతో కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అందువల్లే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అలాగే తేనె కూడా చర్మాన్ని సంరక్షించడంలో ఎంతగానో సహాయ పడుతుంది. కనుక టమాటా, తేనెలను ఈ విధంగా ఉపయోగిస్తే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. యవ్వనంగా కనిపిస్తారు. మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం అందంగా మారుతుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. యవ్వనంగా కనిపిస్తారు.