Hair Problems : ప్రస్తుత తరుణంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఫీలవుతున్నారు. కొందరికి యుక్త వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతోంది. దీంతో చాలా మంది అవస్థలు పడుతున్నారు. అయితే ఇలా జుట్టు తెల్లగా అయ్యేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధిక ఒత్తిడి, వంశ పారంపర్యత, తినే తిండి, తాగే ద్రవాలు, కాలుష్యం, నీరు.. ఇలా అనేక రకాల కారణాల వల్ల జుట్టు తెల్లగా మారుతుంటుంది. ఇక మొదట్లో ఇది ఒకటి రెండు వెంట్రుకలకు మాత్రమే కనిపిస్తుంది. దీంతో వాటిని కత్తిరించేస్తారు. అయితే రాను రాను ఈ సమస్య మరింత అధికమవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియదు.
జుట్టు తెల్లగా అయ్యే సమస్యకు పలు వ్యాధులు కూడా కారణమవుతాయి. థైరాయిడ్, క్యాన్సర్‌కు తీసుకునే కీమోథెరపీ, హార్మోన్ల సమస్యల వల్ల కూడా ఇలా జుట్టు తెల్లగా మారుతుంది. అయితే కొందరిలో మెలనిన్ తగ్గడం వల్ల కూడా నలుపుదనం పోయి జుట్టు తెల్లగా మారుతుంది. ఇక ఈ సమస్య కారణంగా చాలా మంది కృత్రిమ డైలు.. షాంపూలు లేదా నూనెలు.. వంటి వాటిని ఉపయోగిస్తుంటారు. కానీ వీటితో జుట్టు నల్లగా అవుతుంది. అయితే అది తాత్కాలికమే. శాశ్వత పరిష్కారం లభించదు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. కానీ ఓ సహజ సిద్ధమైన చిట్కాను పాటిస్తే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇది సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తుంది. అంతేకాదు.. దీన్ని పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే..
స్వచ్ఛమైన కొబ్బరినూనె అర కప్పు, ఉసిరిక పొడిని రెండు టీస్పూన్ల చొప్పున తీసుకోవాలి. ఒక చిన్న పాత్రలో ముందుగా కొబ్బరినూనె పోసి అందులో ఉసిరిక పొడి వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై వేడి చేయాలి. దీంతో కొంత సేపటికి ఇది నల్లగా మారుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టాలి. చల్లగా అయిన తరువాత ఒక టీస్పూన్ మిశ్రమం తీసుకుని జుట్టుకు బాగా తగిలేలా రాయాలి. ఒక గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. దీన్ని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు. దీంతో జుట్టు ఎప్పటికీ నల్లగా కనిపిస్తుంది. ఇతర జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.