Home Remedy For Neck Darkness : చర్మ సంరక్షణ విషయానికి వస్తే చాలా మంది తమ ముఖాన్ని, శరీరంలో ఇతర భాగాలపై ఉండే చర్మాన్ని సురక్షితంగా, అందంగా ఉండేలా చూసుకుంటారు. కానీ మెడ విషయం మాత్రం పట్టించుకోరు. దీంతో మెడ భాగంలో నల్లగా మారుతుంది. ఇతర చోట్ల అంతా తెల్లగా ఉన్నప్పటికీ కేవలం మెడ భాగంలోనే కొందరికి నలుపుదనం ఏర్పడుతుంది. దీంతో అలాంటి వారు నలుగురిలో తిరగాలన్నా ఇబ్బంది పడుతుంటారు. మెడపై ఉండే నలుపుదనాన్ని పోగొట్టేందుకు ఏం చేయాలో వారికి తెలియదు. అయితే కింద చెప్పిన ఓ అద్భుతమైన చిట్కాను పాటిస్తే మెడపై ఉండే నలుపు దనాన్ని ఇట్టే పోగొట్టవచ్చు. అందుకు ఏయే పదార్థాలు అవసరం అవుతాయో ఇప్పుడు చూద్దాం.
కలబంద..
కలబందను పూర్వం ఈజిప్టు దేశస్థులు అందం కోసం ఉపయోగించేవారు. కలబంద గుజ్జులో మన చర్మానికి మేలు చేసే ఎన్నో రకాల విటమిన్లు, ఎంజైమ్స్, మినర్సల్ ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. కలబంద మన చర్మాన్ని చల్లగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి కనుక కలబంద గుజ్జును రాస్తే చర్మంపై ఉండే వాపులు సైతం తగ్గుతాయి. అలాగే ఎండ వల్ల కందిపోయిన చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. ముఖంపై ఏర్పడే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడవచ్చు. మెడపై ఉండే నలుపుదనాన్ని పోగొట్టడంలోనూ కలబంద గుజ్జు అద్భుతంగా పనిచేస్తుంది.
కాఫీ గింజలు..
కాఫీ గింజల్లో కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంలో రక్త సరఫరాను మెరుగు పరిచి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అదేవిధంగా చక్కెర కూడా చర్మంపై ఉండే మృతకణాలను తొలగించగలదు. చర్మానికి మెరుపు ఇవ్వగలదు. దీంతోపాటు పసుపు కూడా చర్మ సంరక్షణకు అద్భుతంగానే పనిచేస్తుంది. పసుపు చర్మానికి అందాన్నిస్తుంది. నలుపుదనాన్ని పోగొడుతుంది. ఇక ఈ పదార్థాలతో ఒక మిశ్రమాన్ని తయారు చేసి వాడితే దాంతో మెడపై ఉండే నలుపు దనాన్ని ఇట్టే పోగొట్టవచ్చు. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మిశ్రమాన్ని ఇలా తయారు చేయాలి..
2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు, 1 టేబుల్ స్పూన్ కాఫీ విత్తనాల పొడి, 1 టేబుల్ స్పూన్ చక్కెర పొడి, 1 టీస్పూన్ పసుపును తీసుకుని బాగా కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. అవసరం అనుకుంటే నీళ్లను కలుపుకోవచ్చు. తరువాత మెడను సబ్బుతో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా టవల్‌తో తుడవాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మెడపై వృత్తాకారంలో టచ్ చేస్తూ అప్లై చేయాలి. మెడపై ఇలా 5-10 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. మెడపై నల్లగా ఉండే ప్రదేశం మొత్తం కవర్ అయ్యేలా ఈ మిశ్రమాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది.
తరచూ పాటించాలి..
తరువాత 15 నుంచి 20 నిమిషాలపాటు వేచి ఉండాలి. అనంతరం కడిగేయాలి. ఇలా వారంలో 2 లేదా 3 సార్లు చేస్తుండాలి. తరచూ ఇలా చేస్తుంటే మెడపై ఉండే నలుపు దనం పోతుంది. దీంతో మెడ కూడా మీ ముఖంలా అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే బయటకు వెళ్లేటప్పుడు మెడపై కూడా మీరు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే మంచిది. దీంతో ఆ భాగంలో నల్లగా మారకుండా ఉంటుంది. అలాగే కాలుష్యం, హార్మోన్ల సమస్యలు, పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి. దీని వల్ల కూడా చర్మం రంగు మారుతుంది కనుక జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. దీంతో చర్మం నలుపు రంగులోకి మారకుండా ఎల్లప్పుడూ ఒకే రంగులో ఉండేలా చూసుకోవచ్చు. ఈ చిట్కా అందరికీ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అలర్జీలు ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఎలాంటి అలర్జీ రావట్లేదు అనుకుంటేనే ఈ ప్యాక్‌ను మెడపై అప్లై చేయాలి. లేదంటే చర్మ సమస్యలు వస్తాయి. కనుక ఈ చిట్కాను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.