Winter Skin Care : సాధారణంగా చలికాలంలో అధిక చలి తీవ్రత కారణంగా చర్మ సౌందర్యాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడటం కోసం మనం ఎన్నో రకాల మాయిశ్చరైజర్ క్రీములను ఉపయోగిస్తూ ఉంటాము. అయినప్పటికీ కొందరి చర్మం ఎంతో డ్రైగా మారి చర్మం పగులుతూ చాలా నొప్పిని కలిగిస్తుంది. మరి ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు చలికాలంలోనూ చర్మం అందంగా ఉండాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.
1. ముందుగా చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి దూరం కావచ్చు.
2. విటమిన్ ఇ ఉన్నటువంటి క్రీములను మాయిశ్చరైజర్ గా వాడటం వల్ల మన చర్మం ఎప్పుడు పొడిబారకుండా తేమగా ఉంటుంది.
Winter Skin Care : నూనెలతో బాగా మర్దనా చేయాలి..
3. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మన చర్మతత్వానికి సరిపడే నూనెలతో బాగా మర్దనా చేయటం వల్ల మన చర్మానికి కావల్సినంత తేమ అందుతుంది.
4. చలికాలంలో చలి తీవ్రత కారణంగా జీర్ణక్రియ శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే రాత్రి పూట అన్నం కాకుండా చపాతి, పుల్కా వంటి వాటిని తీసుకోవాలి. ఇక రాత్రి భోజనం అనంతరం ప్రతి రోజు ఏదైనా ఒక పండును తీసుకున్నప్పుడే మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోగలం. దీంతో పోషకాలు లభిస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి, ఇ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది.