Hibiscus Flower Oil : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు సమస్యలతో సతమతం అవుతున్నారు. జుట్టు రాలిపోవడంతోపాటు శిరోజాలు చిట్లడం, చుండ్రు, పోషణ తగ్గిపోవడం.. వంటి అనేక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో జుట్టు అంద విహీనంగా కనిపిస్తోంది. ఫలితంగా నలుగురిలో తిరగాలన్నా జుట్టు కనిపించకుండా కవర్ చేసి తిరగాల్సి వస్తోంది. అయితే మందార పువ్వుల నూనెను జుట్టుకు వాడితే ఇలా సమస్యలను ఎదుర్కోవాల్సిన పనిలేదు. జుట్టు ఆరోగ్యంగా అందంగా కనిపిస్తుంది. అయితే మందార పువ్వుల నూనె కోసం బయటకు వెళ్లాల్సిన పనిలేదు. మన ఇంట్లోనే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరినూనె, ఆముదం, బాదంనూనెలను ఒక్కోటి రెండు పెద్ద టీస్పూన్ల చొప్పున తీసుకోవాలి. అన్నింటినీ కలిపి అందులో విటమిన్ ఇ ట్యాబ్లెట్ల నుంచి తీసిన ద్రవాన్ని వేయాలి. అలాగే అందులో గుప్పెడు మందార పువ్వుల ముద్దను కూడా వేయాలి. తరువాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం వడబోయాలి. దీంతో మందార పువ్వుల సారం ఆ మిశ్రమంలోకి వచ్చి చేరుతుంది. ఇలా మందార పువ్వుల నూనె తయారవుతుంది. దీన్ని జుట్టుకు రాయాల్సి ఉంటుంది.
పైన తెలిపిన విధంగా మందార పువ్వుల నూనెను తయారు చేసుకుని జుట్టుకు బాగా రాయాలి. కుదుళ్లకు తగిలేలా నూనెను బాగా తలకు పట్టించాలి. తరువాత 1 గంట సేపు ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 సార్లు చేయాలి. దీంతో ఎలాంటి జుట్టు సమస్య అయినా సరే తగ్గుతుంది. జుట్టు రాలడం ఆగి జుట్టు పెరుగుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు తగ్గుతుంది. జుట్టు అందంగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది. ఇలా మందార పువ్వుల నూనెను తయారు చేసుకుని జుట్టుకు ప్రయోజనాలను పొందవచ్చు.