జలుబు, ముక్కు దిబ్బడ వంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు సహజంగానే మన ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతుంది. ఆ సమస్యలు తగ్గగానే ముక్కు యథావిధిగా పనిచేస్తుంది. అయితే కొందరికి ముక్కు వాసన చూసే శక్తిని కోల్పోతుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. దీన్నే Anosmia అంటారు. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించడం వల్ల వాసన శక్తిని మళ్లీ తిరిగి పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
* నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. 2 నిమిషాల పాటు నీటిని మరిగించాక అందులో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. దీన్ని రోజుకు 2 సార్లు తాగాలి. దీంతో ముక్కుకు వాసన చూసే శక్తి తిరిగి వస్తుంది.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో కొద్దిగా తేనె కలిపి రోజుకు 2 సార్లు తాగాలి. దీంతో కోల్పోయిన వాసన శక్తి తిరిగి వస్తుంది.
* ఆముదాన్ని కొద్దిగా వేడి చేసి దాన్ని ఒక్క చుక్క మోతాదులో రెండు నాసికా రంధ్రాల్లోనూ వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే తిరిగి అన్నింటినీ వాసన చూడగలుగుతారు.
* పది లేదా పదిహేను పుదీనా ఆకులను తీసుకుని వాటిని ఒక కప్పు నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఆ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి తాగాలి. దీన్ని రోజుకు 2 సార్లు తాగాలి. ముక్కు వాసన శక్తిని తిరిగి పొందుతుంది.
* ఒక అల్లం ముక్కను తీసుకుని దాన్ని నీటిలో వేసి మరిగించాలి. ఆ నీటిని కప్పు మోతాదులో రోజుకు 2 సార్లు తాగాలి. కోల్పోయిన వాసన శక్తి తిరిగి వస్తుంది.