Diseases : మనం వంటల్లో ఉపయోగించే పదార్థాలన్నీ కూడా దాదాపుగా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. మన పెద్ద వారు ఈ దినుసుల గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని మన వంటల్లో భాగం చేశారు. ఇలా మన వంటింట్లో ఉండే దినుసులతో పొడిని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల దాదాపుగా 90 శాతం అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. మన అనారోగ్య సమస్యలను నయం చేసే ఈ దినుసుల గురించి.. అలాగే వాటితో పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ పొడిని ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అందరి వంట గదుల్లో జీలకర్ర, వాము, మెంతులు ఉంటాయి. ఇవి అన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని ఉపయోగించి పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పొడిని తయారు చేసుకోవడానికి ఒక కప్పు మెంతులను, ఒక కప్పు వామును, ఒక కప్పు జీలకర్రను తీసుకోవాలి. తరువాత ఒక కళాయిలో వామును వేసి వేయించి జార్ లోకి తీసుకోవాలి. అలాగే మెంతులను, జీలకర్రను కూడా విడివిడిగా వేయించి అదే జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకుని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.
మెంతులు, వాము, జీలకర్రను ఉపయోగించి తయారు చేసుకున్న ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలుపుకుని తాగాలి. ఇలా ఈ పొడిని రోజూ రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఏ వయసు వారైనా ఈ పొడిని తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ పొడిని తయారు చేసి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి. రక్తం కూడా శుభ్రపడుతుంది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి బరువు తగ్గుతారు.
చర్మంపై ముడతలను, కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఈ పొడి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పొడిని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. వాము, మెంతులు, జీలకర్రను కలిపి పొడిగా చేసి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పడతాయి. గుండె పని తీరు మెరుగుపడుతుంది. వినికిడి శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దంత సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ పొడిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని మూడు నెలల పాటు వాడి తరువాత ఒక నెల తీసుకోవడం మానేవేయాలి. తరువాత మరలా తీసుకోవడం ప్రారంభించాలి. ఈ విధంగా జీలకర్ర, మెంతులు, వామును కలిపి పొడిగా చేసి తీసుకోవడం వల్ల ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గడంతోపాటు భవిష్యత్తులో మన దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.