బట్టలకు రక్తం, సిరా మొదలైన మరకలు అయినట్లయితే ఉప్పు కలిపిన నీటిలో ఉతికి వేడి నీటిలో జాడిస్తే మరకలు సులభంగా పోతాయి. బట్టలపై సిరా మరకలు పోవాలంటే నిమ్మరసం కాని, పుల్లని పెరుగుకానీ ఆ మరకపై వేసి రుద్దండి. ఆ పైన ఉప్పుతో సిరా మరక పోయేంత వరకు రుద్ది ఉతికేయాలి. బట్టలు నానబెట్టే ముందు ఆ నీళ్ళలో కాస్త వెనిగర్ ని కలిపితే బట్టలు రంగులు వెలిసి పోకుండా మెరుస్తూ ఉంటాయి.
బట్టల్లో బొద్దింకలు చేరకుండా ఉండేందుకు కలరా ఉండలతో పాటు కర్పూరాన్ని కూడా ఉంచవచ్చు. మగవారి కోటు, ప్యాంటు గుండీలు సన్నటి నైలాన్ దారంతో కుడితే చాలా కాలం తెగకుండా ఉంటాయి. మీ పిల్లల వైట్ సాక్స్ బ్రౌన్ గా తయారయ్యాయా? నీటిలో రెండు లెమన్ స్లయిసెస్ వేసి ఆ నీటిలో ఈ సాక్సును వేసి నీటిలో బాయిల్ చేసి ఆ పైన ఉతకండి చాలు సాక్స్ తెల్లగా మెరిసిపోతాయి.
లెదర్ సోఫా పైన పిల్లలు క్రేయాన్స్ తో గీస్తే, వంటసోడా ఉప్పు కాస్త నీరు కలిపి పేస్టులా చేసి ఈ పేస్టుతో రుద్దితే మరక తొలగిపోతుంది. సిల్క్ బట్టలు నీడలోనే ఆరవేయాలి.