పాత కరెన్సీ నోట్లు లేదా నాణేలను కలెక్ట్ చేసే హాబీ గనక మీకు ఉందా. అయితే మీ పంట పండినట్లే. ఎందుకంటే అలాంటి నోట్లు లేదా నాణేలను ఈ మధ్య కాలంలో చాలా మంది లక్షలు పోసి మరీ కొంటున్నారు. కనుక మీ దగ్గర అలాంటి నోట్లు లేదా నాణేలు ఉంటే మీరు కూడా వాటిని ఆన్లైన్లో అమ్మి ఎంచక్కా సొమ్ము చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైన కరెన్సీ నోట్లకు లక్షలకు లక్షలు ఇచ్చి కొనుక్కునే వారు కూడా ఉన్నారు.
మీ దగ్గర ఇప్పుడు చెప్పబోయే రూపాయి నోటు కనుక ఉంటే మీరు లక్షాధికారి అయిపోవచ్చు. బ్రిటిష్ వారి కాలంలో 1935లో ముద్రించబడిన ఒక రూపాయి కరెన్సీ నోటు మీ దగ్గర ఉందా..? దానిపై అప్పటి బ్రిటిష్ గవర్నర్ జేడబ్ల్యూ కెల్లీ సంతకం ఉంటుంది. సాధారణంగా రూపాయి నోట్లు మార్కెట్లో చెలామణీలో లేవు. కానీ అప్పటి నోటు మాత్రం మీ దగ్గర ఉంటే మీకు ఏకంగా రూ.7 లక్షలు వస్తాయి. అవును, మేం చెబుతున్నది నిజమే.
కాయిన్ బజార్ లేదా క్వికర్ వంటి సైట్లలో పాత కరెన్సీ నోట్లు లేదా నాణేలను కొనే వారు ఉన్నారు. వారు పైన చెప్పిన లాంటి రూపాయి నోట్లకు ఒక్కో దానికి రూ.7 లక్షల వరకు ఇస్తున్నారు. కనుక మీ దగ్గర ఆ నోటు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్లైన్లో విక్రయించండి. లక్షలు పొందండి.