కొత్తగా నిర్మించిన లేదా నిర్మించబోయే జాతీయ రహదారులపై టోల్ టాక్స్ వేస్తారని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి రోడ్లపై ఎవరు వెళ్లినా టోల్ టాక్స్ కట్టాల్సిందే. అయితే దానికి కొందరికి మాత్రం మినహాయింపు ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని, గవర్నర్, రాష్ట్రపతి, న్యాయమూర్తులు… ఇలా చెబుతూ పోతే ఆ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇక వీరు తప్ప ఎవరైనా టోల్ టాక్స్ కట్టి తీరాల్సిందే. సామాన్య జనాలు అయితే టాక్స్ కట్టనిది టోల్ గేట్ దాటనివ్వరు అక్కడి సిబ్బంది. అయితే మీకు తెలుసా..? రెండు సందర్భాల్లో మాత్రం సామాన్యులు కూడా టోల్ కట్టాల్సిన పనిలేదు. అది ఎప్పుడంటే…
టోల్ గేట్ నుంచి 200 మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయితే, అందులో ఉన్నవారు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. టోల్ కట్టకుండానే గేట్ దాటి వెళ్లవచ్చు. ఇక టోల్ గేట్ నుంచి కొద్ది దూరంలో ఎల్లో లైన్ ఉంటుంది. ఆ లైన్‌కు అవతల ఎవరైనా 5 లేదా అంతకన్నా ఎక్కువ నిమిషాల పాటు వేచి ఉన్నట్టయితే వారు కూడా టోల్ కట్టాల్సిన పనిలేదు. నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవచ్చు.
ఈ రెండు రూల్స్‌ను సంబంధిత మంత్రిత్వ శాఖ గతంలో ఎప్పుడో ప్రవేశపెట్టింది. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. కనుక మీరు కూడా ఎప్పుడైనా పైన చెప్పిన రెండు సందర్భాల్లో టోల్ గేట్ వద్ద ఉంటే అప్పుడు టోల్ చెల్లించకండి. ఒక వేళ టోల్ గేట్ సిబ్బంది వాదిస్తే రూల్స్ కచ్చితంగా చెప్పండి. అంతేకానీ… అనవసరంగా టోల్ బాదుడుకు గురి కాకండి. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి..!