థామస్ అల్వా ఎడిసన్ ఏళ్ల తరబడి కష్టపడి బల్బును కనిపెట్టాడు. ఇది హోల్డర్లొ పెట్టాలి. . హోల్డర్ మేడమీద ఉంది. వెళ్ళి బల్బుని పెట్టమని , అతను తన సహాయకులలో ఒకరికి చెప్పాడు. మెట్లు ఎక్కుతుండగా చేయి వణకడంతో ఆ కుర్రాడు కంగారుపడి అప్పుడే తయారు చేసిన బల్బు కిందపడి విరిగిపోయింది.ఎడిసన్ బాధపడలేదు. మరో బల్బు తయారైంది. ఇరవై నాలుగు గంటలు పట్టింది.
అతని బృందంలోని చాలా మంది సహాయకులు దాని కోసం పనిచేశారు. మళ్లీ అదే అబ్బాయికి దాన్ని పెట్టమని ఇచ్చాడు. . మిగిలిన సహాయకులు కోపంగా చూసారు. . ఈ కుర్రాడి వల్ల మళ్లీ బల్బు పగిలిపోతే కొత్తది చేయడానికి మరో ఇరవై నాలుగు గంటలు పడుతుంది. ఎడిసన్ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నాడు? అలా అనుకున్నారు.
దానికి ఎడిసన్, వెయ్యి రోజుల పని తర్వాత మీరు అలాంటి వెయ్యి బల్బులను తయారు చేయగలరు. కానీ ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటే, దానిని సరిచెయ్యడం అంత సులభం కాదు! అన్నారు. అది విని సహచరులు సంతోషించారు.