Chanakya : చాణక్య మన జీవితంలో జరిగే ఎన్నో విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే, జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలని అనుకుంటే, చాణక్య చెప్పినట్లు చేయడం మంచిది. ఇలా చేస్తే, చాణక్య సూత్రాలతో మార్పుని మీరే గమనించవచ్చు. ఆచార్య చాణక్య నాయకుడిగా మారాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలనుకుంటే, ఖచ్చితంగా నాయకత్వం వహించాలి. దీన్ని అనుసరించడం ద్వారా మీరు ఒకరికి ఉదాహరణగా ఉంటారు.
ఒకరికి ఉదాహరణగా ఉంటే, వాళ్ళు మీరు చెప్పేది వింటారు. అలానే, ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అత్యంత విలువైనది. ఏ సంబంధానికైనా నిజాయితీ ముఖ్యం. అలానే మీరు చెప్పేది ఎవరైనా వినాలన్నా, మీరు చెప్పేది ఎవరైనా ఆచరించాలన్న వినయంగా ఉండడం కూడా ఎంతో ముఖ్యమైనది. వినయంతో ఉంటే అందరూ మీ మాట వింటారు. అంతా మంచి జరుగుతుంది.
అలానే, మంచిగా కమ్యూనికేషన్ చేయాలి. కమ్యూనికేషన్ బాగుంటే కూడా, అందరూ మీరు చెప్పేది వింటారు. మీరు చెప్పేది ఫాలో అవుతారు. కనికరం చూపించడం కూడా చాలా ముఖ్యం. ఒక మంచి నాయకుడు ఎప్పుడూ కూడా అనుచరుల పట్ల, కనికరం చూపించాలని చాణక్య అన్నారు. వారు తమ అనుచరుల సమస్యలు, ఆందోళన అర్థం చేసుకోగలరు. సపోర్ట్ ఇస్తారు.
ఇలా, చాణక్య చెప్పినట్లు చేయడం వలన, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇష్టపడతారు అని చాణక్య అన్నారు. చూసారు కదా చాణక్య చెప్పిన విషయాలని, వీటిని పాటిస్తే ఎంత మార్పు వస్తుందో. ఈసారి వీటిని ఆచరించండి ప్రతి ఒక్కరికి ఇష్టమైన వ్యక్తిగా మీరు ఉండవచ్చు. చాలామంది, ప్రతి ఒక్కరికి ఇష్టమైన వ్యక్తిగా మారాలని అనుకుంటుంటారు. అందుకోసం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ, వీటిని ఆచరించినట్లయితే కచ్చితంగా అందరికీ నచ్చే వ్యక్తిగా మీరు ఉండవచ్చు.