Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

భార్యాభ‌ర్త‌లు క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాలి.. లేదంటే సంసారం ముక్క‌ల‌వుతుంది..

Admin by Admin
May 18, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఏంటి దంపతుల మధ్య హద్దులు ఉండాలా అని ఆశ్చర్యపోతున్నారా…? అవును భార్యాభర్తల మధ్య ఆరోగ్యకరమైన సరిహద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత ధృడపరుస్తాయట. ఈ హద్దులను ఎలా పెట్టుకోవాలి.. అసలు హద్దులు ఎంత మేరకు అవసరమో తెలుసుకుందాం రండి. మీ భాగస్వామికి మీపై అమితమైన ప్రేమ ఉందని అనుకుందాం. ఎప్పటికప్పుడు తన ప్రేమను ఏదొక చర్య ద్వారా వ్యక్తీకరిస్తున్నారని అనుకుందాం. కానీ బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవటం, పది మందిలో కౌగలించుకోవటం భాగస్వామి ప్రేమను వ్యక్తపరుస్తున్నారని అనుకుంటారు.. కానీ మీకు అసౌకర్యంగా ఉండొచ్చు. బహిరంగ ముద్దులు, హగ్గులు అనేవి పాశ్చాత్య దేశాల్లో ఆమోదయోగ్యమే అయినప్పటికీ మన దేశంలో పెద్ద అపరాధంగా చూస్తారు.

మనం కూడా ఫారన్‌ దుస్తులు వేసుకుంటున్నాం కదా.. ఫారిన్‌ పోకడలను అనుసరించటంలో తప్పేముంది అనుకోవటం పొరపాటే. మన సంప్రదాయాలు వేరు.. అలవాట్లు వేరు. కాలానుగుణంగా మారినప్పటికీ.. బహిరంగ ముద్దు అని పది మందిలో ఎబ్బెట్టుగా ఉంటుంది. భాగస్వామికి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని భాగస్వామికి అర్థం అయ్యేటట్లు చెప్పేయండి. ఇటువంటివి బహిరంగ ప్రదేశాల్లో చేయవద్దని.. సున్నితంగా చెప్పండి. ఈ హద్దు కేవలం పది మందిలో ఉన్నప్పుడే అని క్షుణ్ణంగా చెప్పేయండి. లైంగిక సరిహద్దు బంధంలో చాలా ముఖ్యమైనది. ఈ హద్దులో సన్నని గీత భార్యాభర్తల మధ్య ఉంటుంది. ఇది ఏమాత్రం దాటినా.. బంధం విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. భార్యాభర్తలు కలయిక సమయంలో కొన్ని అసంబద్ధ మాటలు, పదాలు భాగస్వామి మనస్సు నొప్పించవచ్చు. లేదా.. అవాంఛిత లైంగిక స్పర్శ అనేది ఇబ్బంది పెట్టవచ్చు.

couple maintain some rules for their good relationship

ఎంత భార్యాభర్తలైనప్పటికీ.. వారి భావాలకు స్వేచ్ఛను ఇవ్వటం, ప్రాధాన్యం ఇవ్వటం ముఖ్యమని తెలుసుకోండి. ఒక సమయంలో కలయిక ఇష్టం లేకపోతే.. మెుహమాటం లేకుండా చెప్పేయండి. కానీ సున్నితంగా అర్థం అయ్యే విధంగా చెప్పండి. ఎందుకు వద్దని అంటున్నారో.. ఆ సమయంలో మట్లాడే పదాలు ఎందుకు నచ్చటం లేదో వివరించండి. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం మరింత దగ్గర అవుతుంది. ఒకరి ఇష్టాలు మరొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలు బంధంలో కీలక పాత్ర వహిస్తాయి. ఒక బంధం నిలవాలంటే.. వారి మధ్య ఉన్న భావోద్వేగాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆఫీసు టెన్షన్లు, ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో చిన్నపాటి మనస్పర్థలు కామన్‌గా ఉండేవే. కానీ కోపంలో భాగస్వామిని ఎక్కువ‌గా తిట్టడం, కోపగించుకోవటం చేయటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. దీని నుంచి బయటపడాలంటే.. భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకోవాలి.

కోపంలో అనకూడని మాటలు అంటున్నారని.. కొద్దిగా హెచ్చు స్థాయిలో తిట్లు ఉన్నాయని.. అవి మనసును నొప్పిస్తున్నాయని చెప్పండి. దీనివల్ల భాగస్వామి ఎంత బాధపడుతున్నారన్నది అర్థం అవుతుంది. పది మందిలో మాట్లాడుకునేటప్పుడు.. ఏదైనా చర్చలో ఉన్నప్పుడు భాగస్వామిని సపోర్ట్‌ చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. ఎట్టి పరిస్థితిల్లోనూ కించపరచకండి. ఒకరి ఆలోచనలను మరొకరు గౌరవించండి. ఒకరి భావాలు గాయపడకుండా.. మీ ఒపీనియన్‌ చెప్పేలా చూసుకోండి. మీ భాగస్వామిని మీరే అగౌరవపరిస్తే.. పది మందిలో మీకు కూడా ఎటువంటి గౌరవం లభించదని గుర్తుంచుకోండి. ఎటువంటి ఈగోలకు పోకుండా.. నేను చెప్పిందే నెగ్గాలనే పంతాలపై బంధాలు నడవకూడదు. అందువల్ల ఇద్దరి మధ్య చిన్నపాటి హద్దులు.. గీత దాటని హద్దులు బంధాన్ని బలపరుస్తాయని తెలుసుకోండి.

Tags: couple
Previous Post

ఒంట‌రిత‌నంతో బాధ‌ప‌డుతున్నారా.. అది చాలా ప్ర‌మాద‌మ‌ట‌.. ఏం చేయాలంటే..?

Next Post

చాలా మంది పురుషులు పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఎందుకు ఉంటున్నారంటే..?

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!