Salt : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. ఎందులో అయినా సరే తగినంత ఉప్పు లేకపోతే ఆ వంటకు రుచీపచీ ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజువారీ ఆహారంలో భాగంగా ఆహారానికి రుచి రావడం కోసం ఉప్పును ఉపయోగిస్తాము. అయితే రోజుకు పరిమితికి మించి ఉప్పును తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
చాలామందికి వారి ఆహారంలో భాగంగా అధిక మొత్తంలో ఉప్పు, కారం తీసుకోవడం అలవాటుగా ఉంటుంది. ఇలా అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం.
1. ఎవరైతే రోజు వారీ ఆహారంలో భాగంగా ఉప్పును అధికంగా తీసుకుంటారో వారు ఎక్కువగా మూత్రానికి వెళ్తుంటారు. అలాగే వారికి ఎక్కువ దాహం అనిపిస్తుంది. ఇలా దాహం వేసినప్పుడు అధికంగా నీటిని తీసుకోవాలి, లేకపోతే శరీరం మొత్తం డీహైడ్రేషన్ అవుతుంది.
2. చాలామంది ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల పాదాల మడమలలో నీరు చేరి పోతుంది. ఇలా నీరు చేరడం వల్ల మనకు కొంత దూరం నడిచినా అధిక నొప్పిని కలుగజేస్తుంది.
3. చాలామంది తరచూ ఉప్పును నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటారు. ఇలా చప్పరించడం వల్ల మన నాలుకపై ఉండే రుచి కళికలు రుచిని ఆస్వాదించే గుణాన్ని కోల్పోతాయి. ఈ క్రమంలోనే మరే ఇతర ఆహార పదార్థాల రుచిని ఆస్వాదించలేము. అలాంటప్పుడు మనం ఎలాంటి ఆహార పదార్థాలు తిన్నా రుచిగా అనిపించవు.
4. ఎవరైతే అధిక మొత్తంలో ఉప్పును తీసుకుంటారో వారి శరీరంలో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇలా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నవారు తొందరగా డీహైడ్రేషన్ బారినపడే అవకాశాలు ఉంటాయి.
కనుక ఉప్పును ఎక్కువగా తీసుకునే వారు నీటిని అధికంగా తీసుకోవాలి. లేదా ప్రతి రోజూ మన శరీరానికి కావలసినంత ఉప్పును మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. రోజుకు మనం ఒక టీస్పూన్ మించి ఉప్పును తీసుకోరాదు. లేదంటే పైన చెప్పిన సమస్యలు వస్తాయి.