Brain After Death : మనిషి చనిపోయిన తరువాత అసలు ఏం జరుగుతుంది..? అన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఒక మనిషిలో ఉండే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కొన్ని రోజులకు మరో జీవిలో ప్రవేశిస్తుందని చెబుతారు. దీంతో ఆ వ్యక్తికి పునర్జన్మ లభిస్తుంది. గత జన్మలో ఆ మనిషి చేసిన పాప పుణ్యాలకు అనుగుణంగా మరుసటి జన్మ ఉంటుందని చెబుతారు. ఇక నిత్యం దైవ ప్రార్థన చేసేవారికి, ఆధ్యాత్మిక భావాలను ఎక్కువగా కలిగి ఉన్నవారికి మళ్లీ జన్మ ఉండదని అంటారు.
అయితే చనిపోయిన తరువాత మనిషి శరీరంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. కానీ మరణానంతరం శరీరంలో కొన్ని అవయవాలు అయితే పనిచేస్తాయని మాత్రం వైద్యులు ఇప్పటికే నిర్దారించారు. ఇక మనిషి చనిపోయిన తరువాత సుమారుగా 7 నిమిషాల పాటు మెదడు పనిచేస్తుందని కూడా వైద్యులు నిర్దారించారు. అయితే ఆ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది ? అనే విషయాన్ని మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోయారు.
కానీ కొందరు సైంటిస్టులు ఇదే విషయమై పరిశోధనలు చేశారు. పూర్తిగా కాదు కానీ.. చూచాయగా మాత్రం ఈ విషయం గురించి తెలుసుకున్నారు. మనిషి చనిపోయిన తరువాత 7 నిమిషాల పాటు మెదడు పనిచేస్తుందని, మొదటి నిమిషంలో మనిషి తన పుట్టిన రోజును గుర్తు చేసుకుంటాడని చెప్పారు. అలాగే రెండో నిమిషంలో ఆ మనిషికి సంతోషకరమైన క్షణాలు, స్నేహితులు గుర్తుకు వస్తారట. మూడో నిమిషంలో మొదటి, చివరి ప్రేమ గుర్తుకు వస్తాయట. 4వ నిమిషంలో విచార జ్ఞాపకాలు, ఒంటరి క్షణాలు, 5వ నిమిషంలో అద్భుత క్షణాలు, 6వ నిమిషంలో ఇతరులకు చేసిన మంచి, చెడు పనులు గుర్తుకు వస్తాయట. అయితే 7వ నిమిషంలో ఏం జరుగుతుందో మాత్రం పరిశోధకులు కాప్చర్ చేయలేకపోయారట. ఇలా వారు తమ పరిశోధనల వివరాలను వెల్లడించారు.