Brown Rice Salad : బ్రౌన్ రైస్‌ను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బ్రౌన్ రైస్‌లో మనకు కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ తింటే బరువు తగ్గుతారు. షుగర్ అదుపులోకి వస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే బ్రౌన్ రైస్‌ను నేరుగా తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ కింద చెప్పిన విధంగా దాంతో సలాడ్‌ను చేసుకుంటే.. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఈ క్రమంలోనే బ్రౌన్ రైస్‌తో సలాడ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ రైస్ సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రౌన్ రైస్ – ఒకటిన్నర కప్పు, తరిగిన క్యాప్సికం – 1, ఉల్లికాడలు (తరిగినవి) – 3, జీడిపప్పు – అర కప్పు, ఆలివ్ ఆయిల్ – అర కప్పు, సోయాసాస్ – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బ – 1, నల్ల మిరియాలు – 1 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
బ్రౌన్ రైస్ సలాడ్‌ను తయారు చేసే విధానం..
ముందుగా ఒకటిన్నర కప్పుల బ్రౌన్ రైస్ తీసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ జార్ తీసుకుని ఆలివ్ ఆయిల్, సోయా సాస్, వెల్లుల్లి ముక్కలు, మిరియాలు వేసి ఒకసారి షేక్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో అన్నం వేసి అందులోనే ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని వేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో తరిగిన క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, అర కప్పు జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి మొత్తం అంతా బాగా కలిసే వరకు పై నుండి కింద వరకు మిక్స్ చేయాలి. దీంతో బ్రౌన్ రైస్ సలాడ్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదా మధ్యాహ్నం లంచ్‌లోనూ తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. బ్రౌన్ రైస్ అంటే ఇష్టంలేని వారు ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు. అందరికీ నచ్చుతుంది.